ప్రభం‘జన’ తొలి పది దేశాలు

11 Jul, 2018 19:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ జనాభా నానాటికీ పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 7.5 కోట్ల జనాభా పెరుగుతోంది. 2018 జూలై నాటికి ప్రపంచ జనాభా 760 కోట్లు ఉన్నట్లు అంచనా. ఇదేవిధంగా పెరుగుతూ పోతే భవిష్యత్తులో ప్రపంచ వ్యాప్తంగా 2030 నాటికి 840 కోట్లు, 2050 నాటికి 960 కోట్లకు జనాభా చేరుకుంటుంది. నేడు (జులై 11) ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా పాపులేషన్‌లో ముందున్న పది దేశాల గురించి తెలుసుకుందాం.

చైనా
1,415,171,198తో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనా తొలి స్థానంలో నిలించింది. ప్రపంచ జనాభాలో అత్యధికంగా 18.54 శాతం జనాభా చైనాలోనే ఉంది. ఒక చదరపు కిలోమీటరులో 151 మంది ప్రజలు నివసిస్తున్నారు. చైనా జనాభాలో సగటు వయస్సు 37 ఏళ్లు.

ఇండియా
1,354,464,444 జనాభాతో భారతదేశం ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో 17.74 శాతం ప్రజలు భారత్‌లో నివశిస్తున్నారు. ఒక చదరపు కిలోమీటర్‌కు 455 మంది ప్రజలు జీవిస్తున్నారు. ఇది చైనా కంటే రెండింతులు ఎక్కువ. భారతీయ జనాభాలో సగటు వయసు 27 ఏళ్లు. ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న దేశంగా భారత్‌ తొలి స్థానంలో ఉంది.

అమెరికా
326,830,645 జనాభాతో అమెరికా ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో అమెరికన్లు 4.28 శాతం మంది ఉన్నారు. ఒక చదరపు కిలోమీటర్‌కు కేవలం 36 మంది మాత్రమే నివశిస్తున్నారు. అమెరికన్ల జనాభాలో సగటు వయస్సు 37 ఏళ్లు.

ఇండోనేషియా
266,872,775 జనాభాతో దీవుల దేశం ఇండోనేషియా నాలుగో స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో వీరి శాతం 3.5 శాతం. ఒక చదరపు కిలోమీటర్‌కు 147 మంది ప్రజలు నివశిస్తున్నారు. వీరి సగటు వయసు 28 ఏళ్లు.

బ్రెజిల్‌
266,872,775 జనాభాతో ప్రపంచంలో బ్రెజిల్‌ ఐదో స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో వీరి శాతం 2.76 శాతం. ఒక చదరపు కిలోమీటర్‌కు కేవలం 26 మంది మాత్రమే నివశిస్తున్నారు. వీరి సగటు వయసు 31 ఏళ్లు.

పాకిస్తాన్‌
200,919,769 జనాభాతో ఆరో స్థానంలో ఉంది. ప్రపంచంలో పాక్‌ జనాభా శాతం 2.63. ఒక చదరపు కిలోమీటర్‌కి 260 మంది ప్రజలు నివశిస్తున్నారు. వీరి జనాభా సగట వయసు 22 ఏళ్లు.

నైజీరియా
196,041,916 జనాభాతో నైజీరియా ప్రపంచంలో ఏడో స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో నైజీరియన్ల్‌ శాతం 2.57. ఒక చదరపు కిలోమీటర్‌కి 215 మంది నైజీరియన్లు నివశిస్తున్నారు.

బంగ్లాదేశ్‌
166,415,337 జనాభాతో భారత సరిహద్దు దేశం బంగ్లాదేశ్‌ ఎనిమిదో స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో వీరి శాతం 2.18. ఒక చదరపు కిలోమీటర్‌కి అత్యధికంగా 1278 మంది నివశిస్తున్నారు. వీరి జనాభా సగటు వయసు 26 ఏళ్లు.

రష్యా
143,964,017 జనాభాతో రష్యా ప్రపంచంలో తొమ్మిదో స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో వీరి శాతం 1.89 శాతం. ఒక చదరపు కిలోమీటర్‌కు కేవలం 9 మంది మాత్రమే నివశిస్తున్నారు. వీరి సగటు వయసు 38 ఏళ్లు.

మెక్సికో
130,803,510 జనాభాతో మెక్సికో ప్రపంచంలో పదో స్థానం ఆక్రమించింది. ప్రపంచంలో వీరి జనాభా 1.71 శాతం.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అమెరికాలో నలుగురు తెలుగువారు దుర్మరణం

అమెరికాలో దారుణం

ఇరాన్‌ను వదలం: ట్రంప్‌

పుర్రె ఎముకలు పెరుగుతున్నాయి

‘పిల్లి’మంత్రి ప్రెస్‌మీట్‌.. నవ్వలేక చచ్చిన నెటిజన్లు

కూతురి కోసం ఓ తండ్రి వింత పని..

అనుకోకుండా ఆ మొక్కను తగిలాడు అంతే..

బలవంతంగా కడుపు కోసి తీసిన బిడ్డ మృతి

అరిజోనా ఎడారిలో భారతీయ చిన్నారి మృతి

వయసు 21 చుట్టొచ్చిన దేశాలు 196

అలారం పీక నొక్కారో పీడిస్తుందంతే! 

ఆ దేశాలే బాధ్యులు

ఇమ్రాన్‌.. ఏంటిది; ఆరోగ్యం బాగాలేదేమో!

28 ఏళ్ల తరువాత.. తొలిసారి

ఓ మనిషిని ఇంత దారుణంగా చంపొచ్చా?!..

గన్నుతో తలపై నాలుగు రౌండ్లు కాల్చినా..

సిగరెట్‌ తెచ్చిన తంటా

‘వారికి తండ్రంటే ఎంతో ప్రేమ.. బతకనివ్వండి’

అమెరికాకు హువావే షాక్!

2 నౌకలపై దాడి

పాక్‌కు బుద్ధిచెప్పండి

ఎవరెస్టుపై మరణాలు రద్దీ వల్ల కాదు

శ్రీలంక ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా రువాన్‌ కులతుంగ 

జిన్‌పింగ్‌, పుతిన్‌లతో మోదీ భేటీ

కోతి చేసిన పనికి ఆ కుటుంబం..

75ఏళ్ల తర్వాత ఒక్కటైన ప్రేమజంట

పాక్‌ మీదుగా వెళ్లను

సోషల్‌ మీడియా తాజా సంచలనం

చిట్టి పెంగ్విన్లకు పెద్ద కష్టం!

భారత్‌పై మరోసారి విరుచుకుపడ్డ ట్రంప్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విజయ్‌కి జోడీ?

అలా మాట్లాడటం తప్పు

ఆదిత్య వర్మ రెడీ

యూపీ యాసలో...

తిరిగొస్తున్నా

మళ్ళీ మళ్ళీ చూశా