టెక్సాస్ వాల్‌మార్ట్‌లో ఉగ్ర కలకలం

15 Jun, 2016 01:39 IST|Sakshi
టెక్సాస్ వాల్‌మార్ట్‌లో ఉగ్ర కలకలం

ఆగంతకుడిని కాల్చిచంపిన పోలీసులు
 
 అమరిల్లో (టెక్సాస్): అమెరికా ఆర్లెండో కాల్పుల్లో 49 మంది మృతిచెందిన ఘటన మరువక ముందే  టెక్సాస్‌రాష్ట్రం అమరిల్లోలోని ఓ వాల్‌మార్ట్ మాల్‌లో ఉగ్ర కలకలం రేగింది. రెండుగంటలపాటు శ్రమించిన అమరిల్లో పోలీసులు మాల్‌లో ఓ వ్యక్తిని బందీగా చేసుకున్న ఆగంతకుడిని (సోమాలియా దేశస్తుడిగా అనుమానిస్తున్నారు) కాల్చిచంపారు. పనిచేసే చోట ఇద్దరు  మధ్య నెలకొన్న ఘర్షణే ఈ ఘటనకు కారణమని, ఉగ్రదాడి కాదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

అంతకుముందు, మంగళవారం ఉదయం ఇద్దరు సాయుధులు వాల్‌మార్ట్‌లోకి చొచ్చుకెళ్లారనే వార్తలు కలకలం రేపాయి. మాల్‌లో కొందరిని వీరిద్దరు బందీలుగా చేసుకున్నారని తెలియటంతో పోలీసులు మాల్ చుట్టుపక్కల ఇళ్లను ముందుజాగ్రత్తగా ఖాళీ చేయించారు. కాసేపటి తర్వాత లోపలకు ప్రవేశించిన పోలీసులు వెనుకద్వారం గుండా మాల్‌లో ఉన్న వారిని బయటకు పంపించారు. తర్వాత ఓ గదిలో ఓ వ్యక్తిని బందీని చేసుకున్న ఆగంతకుడిని మట్టుబెట్టారు.

మరిన్ని వార్తలు