ఐఎస్ఐఎస్ దారుణాలు ఇవి!

23 Jul, 2016 16:17 IST|Sakshi
ఐఎస్ఐఎస్ దారుణాలు ఇవి!

రక్కా, మొసుల్ పట్టణాల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు ఇటీవల సంకీర్ణ బలగాల చేతిలో గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ నేపథ్యంలో వారు డమాస్కస్లో తమ ప్రాబల్యాన్ని పెంచుకునే పనిలో పడినట్లు తెలుస్తోంది. డమాస్కస్లో తమ పాలనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తాజాగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ పబ్లిష్ చేసింది. ఈ ఫోటోల్లో కొన్ని ఐఎస్ ఉగ్రవాదులు అమలు చేస్తున్న క్రూరమైన శిక్షలతో పాటు.. వారి ఆంక్షలకు సంబంధించినవి ఉన్నాయి.

హోమో సెక్సువల్ నేరానికి పాల్పడినందుకు గాను ఓ వ్యక్తిని బిల్డింగ్ మీద నుంచి తోసివేసిన ఫోటోతో పాటు.. ఓ ముసుగువేసిన ఖైదీని మోకాళ్లపై కూర్చోబెట్టి షూట్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. అలాగే టీషర్ట్లపై ఉన్న బ్రాండ్ లోగోలను తొలగిస్తూ, ప్యాంటు పొడవు కొలతలు చూస్తూ వారు విధించిన ఆంక్షలకు సంబంధించిన ఫోటోలు ఐఎస్ఐఎస్ విడుదల చేసింది.
 

మరిన్ని వార్తలు