నిందితులపై కాల్పులు.. పోలీస్ ఆఫీసర్ అరెస్ట్

17 Mar, 2016 09:59 IST|Sakshi
నిందితులపై కాల్పులు.. పోలీస్ ఆఫీసర్ అరెస్ట్

వాషింగ్టన్: చోరీకి పాల్పడుతున్న ఇద్దరు దొంగలపై కాల్పులు జరిపిన ఓ పోలీస్ అధికారి కటకటాల పాలైయ్యాడు. ఆ వివరాలుఇలా ఉన్నాయి.. అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్ కు చెందిన టెక్సాస్ పోలీసు అధికారి కెన్ జాన్సన్ గత ఆదివారం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నాడు. ఇంతలో ఇద్దరు యువకులు ఓ వాహనాన్ని దొంగిలిస్తున్నట్లు గుర్తించాడు. వెంటనే స్పందించిన జాన్సన్ ఆ ఇద్దరు అగంతకులపై కాల్పులు జరిపి చోరీకి అడ్డుకట్ట వేశాడు. పోలీస్ జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు. మరో యువకుడు గాయాలపాలయ్యాడు.

ఏం జరిగిందో తెలియదు కానీ జాన్సన్ ను బుధవారం సాయంత్రం అరెస్ట్ చేసి డల్లాస్ కౌంటీ జైలుకు తరలించారు. ఈ విషయాలను పోలీస్ చీఫ్ పాల్ స్పెన్సర్ వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి విచారణ జరగుతోందని సరైన ఆధారాలు లభిస్తే జాన్సన్ ను విడిచి పెడతామని స్పెన్సర్ తెలిపారు. అయితే ఈ కేసు విచారణ కొన్ని రోజులు పట్టే అవకాశం ఉందన్నారు. వాస్తవానికి జాన్సన్ కాల్పులు జరిపింది దుండగులపైనే, కానీ ఓ యువకుడు మృతిచెందాడని ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. వాహనాన్ని ఇద్దరు దొంగిలించి పారిపోతుండగా ఇది గమనించిన జాన్సన్ వారిపై కాల్పులు జరిపి చోరీని అడ్డుకున్నాడు. అయితే ఆరోపణలు వచ్చిన కారణంగా జాన్సన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు