థాయ్‌ ప్రధాని తీరు చూస్తే అవాక్కే!

11 Jan, 2018 14:32 IST|Sakshi

బ్యాంకాక్‌ : దేశాధ్యక్షులకు లేదా దేశ ప్రధాన మంత్రులకు మీడియాను చూస్తే చిర్రెత్తుకొస్తుందో ఏమో! వారడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటేనే చికాకు పడతారేమో! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రశ్నలడిగిన జర్నలిస్టుల వైపు గుర్రుగా చూస్తారు. ‘అసలు నీవు రాసే వార్తలన్నీ నకిలీ వార్తలంటూ’ కొట్టి పారేస్తారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ లాంటి వారు అసలు మీడియానే దగ్గరికి రానీవ్వరు. వారు ప్రశ్నలడిగే అవకాశమే ఉండదు కనుక. 

థాయ్‌లాండ్‌ ప్రధాన మంత్రి ప్రయూత్‌ చాన్‌–ఓచా వీరికి భిన్నంగా ఆలోచించారు. మీడియా ప్రశ్నల నుంచి తప్పించుకునేందుకు కొత్త రకం వ్యూహం పన్నారు. ఇటీవల ఓ ముఖ్యమైన మీడియా సమావేశంలో మైకు ముందు క్లుప్తంగా మాట్లాడారు. ప్రశ్నలడిగితే ‘ఇదిగో వీడిని అడగండీ!’ అంటూ తన నిలువెత్తు కటౌట్‌ను పక్కనే పెట్టించి చేతులూపుతూ వెళ్లిపోయారు. దేశం ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితులు, ఎన్నికలు, ఆందోళనకారుల అరెస్టులు....ఇలా ఎన్నో అంశాల గురించి ప్రశ్నలు అడుగుదామనుకొని వచ్చిన ప్రయూత్‌ ప్రవర్తనకు నోరెల్లబెట్టి తెల్లబోయారు. ఇక చేసేదేమీలేక ప్రధాని కటౌట్‌ ముందు సరదాగా వివిధ భంగిమల్లో ఫొటోలు, సెల్ఫీలు దిగి సంబరపడ్డారు.

మరిన్ని వార్తలు