16.23 గంటలు.. 14,535 కి.మీ.

7 Feb, 2017 02:33 IST|Sakshi
16.23 గంటలు.. 14,535 కి.మీ.

అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే విమానం ప్రారంభం  
వెల్లింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే నాన్‌స్టాప్‌ విమాన సర్వీసును ఖతార్‌ ఎయిర్‌వేస్‌ ఆదివారం ప్రారంభించింది. దోహా విమానాశ్రయం నుంచి ఆదివారం ఉదయం గం.5.02 నిమిషాలకు (స్థానిక కాలమానం) బయలుదేరిన క్యూఆర్‌920 విమానం సోమవారం ఉదయం గం.7.25 నిమిషాలకు (స్థానిక కాలమానం) న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌కు చేరుకుంది. 16 గంటల 23 నిమిషాల్లో 14,535 కి.మీ పయనించి, ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే విమానంగా రికార్డు నెలకొల్పింది.

విమానంలో నలుగురు పైలట్లు, 15 మంది సిబ్బంది ఉన్నారు. ఆక్లాండ్‌లో విమానానికి ఘనస్వాగతం పలికారు. ఆకాశమార్గంలో కొలిచినపుడు ఎయిరిండియాకు చెందిన ఢిల్లీ–శాన్ ఫ్రాన్సిస్కో విమానాన్ని అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించేదిగా చెబుతారు. భూపరితలంపై దూరాన్ని కొలిస్తే మాత్రం ఖతార్‌ ఎయిర్‌వేస్‌ విమానమే ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది.

మరిన్ని వార్తలు