మహిళలకు డేంజర్ నగరాలు ఇవే..!

24 Mar, 2016 18:55 IST|Sakshi
మహిళలకు డేంజర్ నగరాలు ఇవే..!

న్యూయార్క్: ప్రపంచంలో చాలాచోట్ల మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనేది కాదనలేని వాస్తవం. ఎక్కడికి వెళ్లినా వారికి మాటలు, చేతలతో లైంగిక వేధింపులు తప్పడం లేదు. ముఖ్యంగా మహిళలు ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కాదు. ఇలా ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా ఏ నగరంలో మహిళ పరిస్థితి భయంకరంగా, అపాయకరంగా ఉందో తెలుసుకునేందుకు ది థామ్సన్ రాయిటర్స్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రపంచంలోని 20 దేశాల రాజధానుల్లోని 16 నగరాల్లో మహిళలను ప్రశ్నించింది.

మొత్తం 6,550మంది మహిళలను రవాణా వ్యవస్థ ద్వారా ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటని ప్రశ్నించింది. దీని ఆధారంగా మహిళలకు అపాయకరంగా మారిన నగరాల జాబితా తయారు చేయగా అందులో భారత్ నుంచి ఢిల్లీ నాలుగో స్థానం చేరింది. అంతేకాదు, లండన్ లోని 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉన్న 41శాతం స్త్రీలు భయంకరమైన లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.

మహిళలకు ప్రజా రవాణా ద్వారా డేంజర్ గా మారిన టాప్ 16 నగరాలివే..
1.బొగోటా, కొలంబియా
2.మెక్సికో నగరం, మెక్సికో
3.లిమా, పెరూ
4 .న్యూఢిల్లీ, భారత్
5.జకర్తా, ఇండినేషియా
6.బ్యూనస్ ఎయిర్స్, అర్జెంటీనా
7.కౌలాలంపూర్, మలేషియా
8.బ్యాంకాక్, థాయిలాండ్
9.మాస్కో, రష్యా
10.మనీలా, పిలిప్పీన్స్
11.పారిస్, ఫ్రాన్స్
12.సియోల్, దక్షిణ కొరియా
13.లండన్, ఇంగ్లాండ్
14.బీజింగ్, చైనా
15.టోక్యో, జపాన్
16.న్యూయార్క్, అమెరికా

మరిన్ని వార్తలు