మాంసం ఎక్కువగా లాగిస్తున్న దేశాలివే..

4 Nov, 2016 08:43 IST|Sakshi
మాంసం ఎక్కువగా లాగిస్తున్న దేశాలివే..

న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాలో ముక్క లేనిదే ముద్ద దిగడం లేదని ఐక్యరాజ్య సమితి వెల్లడించిన ఓ నివేదికలో తెలిసింది. ఒక అమెరికన్ ఏడాది కాలంలో సరాసరిన 126.6 కిలోల మాంసాన్ని హాంఫట్ చేస్తున్నాడు.

ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో వెల్లడించిన 'ద స్టేట్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్' నివేదికలో కేవలం లగ్జెంబర్గ్, హాంకాంగ్ ప్రజలు మాత్రమే మాంసం వినియోగంలో అమెరికా కంటే ముందున్నారని తేలింది. ఇది లగ్జెంబర్గ్‌లో 142.5 కిలోలుగా ఉండగా.. హాంకాంగ్‌లో 134 కిలోలుగా ఉంది. బ్రిటన్‌ 83.9 కిలోల మాంసం వినియోగంతో 25వ స్థానంలో నిలిచింది.

175 దేశాలతో విడుదల చేసిన ఈ జాబితాలో ఇక అతితక్కువ మాంసం వినియోగిస్తున్న దేశంగా బంగ్లాదేశ్ నిలిచింది. ఇక్కడ ఏడాది కాలంలో తలసరి వినియోగం 3.1 కిలోలుగా ఉంది. బురుండీ, కాంగోలు 3.7, 4.6 కేజీలతో బంగ్లాదేశ్ తరువాత తక్కువ వినియోగిస్తున్న దేశాలుగా నిలిచాయి. భారత్ 5.1 కిలోల తలసరి వినియోగంతో ఈ జాబితాలో 169వ స్థానంలో నిలిచింది.
 

మరిన్ని వార్తలు