ఏకరూపతతో దేశాభివృద్ధికి విఘాతం : రాష్ట్రపతి ప్రణబ్

14 Jul, 2016 03:36 IST|Sakshi
ఏకరూపతతో దేశాభివృద్ధికి విఘాతం : రాష్ట్రపతి ప్రణబ్

డార్జిలింగ్ : ఏకరూపత దేశాభివృద్ధికి విఘాతం కాగలదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. దేశంలో ఉమ్మడి పౌరస్మృతి తెచ్చే అంశంపై చర్చ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. బుధవారం నేపాలీ కవి భానుభక్త ఆచార్య 202వ జయంత్యుత్సవంలో ఆయన ప్రసంగించారు. 

దేశంలో ఏకరూపత తెచ్చేందుకు ప్రయత్నిస్తే అది మన సామాజికాభివృద్ధికి పెనువిఘాతం కలిగిస్తుందని హెచ్చరించారు. భిన్నత్వంలో ఏకత్వం మన బలం అన్నారు. నేపాల్‌తో భారత్‌కు సత్సంబందాలున్నాని చెప్పారు.  భానుభక్త  నేపాలీలో రచించినప్పటికీ, ఆయన సందేశం మొత్తం మానవాళికి వర్తిస్తుందన్నారు.

మరిన్ని వార్తలు