ఇక హాయిగా విడాకులు తీసుకోవచ్చు..!

2 Jun, 2016 15:55 IST|Sakshi
ఇక హాయిగా విడాకులు తీసుకోవచ్చు..!

ఇప్పటివరకు మనం ఎన్నో యాప్స్ గురించి విన్నాం, యూజ్ చేశాం. అయితే యూకేకు చెందిన కొందరు సాఫ్ట్ వేర్ డెవలపర్స్ ఓ కొత్త యాప్ ను రూపొందించనున్నారు. బ్రేకప్ చెప్పడం, ఆ తర్వాత తలెత్తనున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బ్రేకప్ యాప్ తయారు చేస్తున్నారు. గతంలో భార్యాభర్తలు బ్రేకప్ చెప్పేసి విడాకులు తీసుకునేవారు. అయితే ఈ తతంగం జరగడానికి కొన్ని నెలల సమయంతో పాటు లాయర్లను కలవడం ఇలా ఎన్నో ఉంటాయి. ఇక నుంచి సామరస్యపూర్వకంగా, హాయిగా పార్ట్ నర్ గా గుబ్ బై చెప్పవచ్చు.

భార్యాభర్తల విడాకుల వ్యవహారం ఖర్చు కూడా వేల పౌండ్స్(భారత కరెన్సీలో లక్షల రూపాయలు) అవుతుంది. వీటిని అధిగమిస్తూ న్యూ యాప్ రూపొందితే కేవలం పదుల పౌండ్ల ఖర్చు మాత్రమే పడుతుంది. లీగల్ సమాచారం, భార్యాభర్తల పరస్పర ఒప్పంద అంగీకారం, లాయర్లకు సంబంధించిన ఇతర ముఖ్యమైన వివరాలు ఈ యాప్ లో అందుబాటులో ఉంచుతారు. కోర్టుల చుట్టూ తిరగటం, ఎందుకు బ్రేకప్ చెప్పారు, ఏమైందంటూ సవాలక్ష ప్రశ్నల నుంచి తప్పించుకునే కొత్త యాప్ దోహద పడుతుందని అక్కడి సెలబ్రిటీలు భావిస్తున్నారు.

2013 నవంబర్ నుంచి ఇప్పటివరకు ఇంగ్లండ్, వేల్స్ లలో కలిపి 1.15 లక్షల విడాకులు జరిగాయని ఇందులో 42 శాతం మంది ఏడాది ముగిసేలోపే బ్రేకప్ చెప్పారని గణాంకాలు చెబుతున్నాయి. కోర్టు, లాయర్ అంటూ ఈ వ్యవహారం లీగల్ గా ముగియడానికి దాదాపు రూ.3 లక్షల వరకు ఖర్చుపెట్టారని తెలుస్తోంది. ప్రస్తుతం బ్రేకప్ యాప్ ట్రయల్స్ జరుగుతున్నాయని, సెప్టెంబర్ లో వాడుకలోకి రానున్నట్లు ఫ్యామిలీ కౌన్సెలర్, ఐటీ కన్సల్టెంట్ అయిన పిప్ విల్సన్ వివరించారు.

మరిన్ని వార్తలు