ఆనందంలో అట్టడుగున..!

21 Mar, 2017 04:22 IST|Sakshi
ఆనందంలో అట్టడుగున..!

సంతోష సూచిలో 121వ స్థానంలో భారత్‌
తొలిస్థానంలో నార్వే
ఐరాస నివేదికలో వెల్లడి


ఐక్యరాజ్యసమితి: భారతీయుల కంటే పాకిస్తానీయులే ఎక్కువ సంతోషకర జీవితాన్ని గడుపుతున్నారు.. మన కంటే ఇరాక్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశ వాసులే అధిక ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. కాగా సంతోషకర దేశాల జాబితాలో భారత్‌ 121వ స్థానానికి పరిమితమై అట్టడుగున నిలిచింది.  ‘ప్రపంచ సంతోషకర దేశాల నివేదిక 2017’ ఈ విషయాన్ని వెల్లడించింది. అంతర్జాతీయ సంతోషకర దినోత్సవం సందర్భంగా సోమవారం ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో జాబితాను విడుదల చేశారు. మొత్తం 155 దేశాలకు ర్యాంకులు ప్రకటించారు. 2014–15 నివేదిక ప్రకారం భారత్‌ స్థానం 118 కాగా.. ఇప్పుడు నాలుగు స్థానాలు తగ్గి చైనా, పాకిస్తాన్, నేపాల్‌ కంటే వెనుకంజలో నిలిచింది. ప్రజల తలసరి ఆదాయం, సాంఘిక భద్రత, ఆరోగ్యకర జీవితం, నచ్చింది ఎన్నుకోవడంలో ఉండే స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతిపై జాగరూకత ఆధారంగా జాబితాను రూపొందించారు. వ్యక్తిగత అంశాలు సంతోషాన్ని ప్రభావితం చేస్తాయని ఈ నివేదిక వెల్లడించింది.

డెన్మార్క్‌ను వెనక్కినెట్టి...
ప్రపంచంలో అంత్యంత సంతోషకర దేశంగా నార్వే నిలిచింది. గతేడాది కంటే మూడు స్థానాలు ఎగబాకి నార్వే ఈ ఘనత సాధించింది. మూడేళ్లుగా నంబర్‌వన్‌గా కొనసాగుతున్న డెన్మార్క్‌ రెండోస్థానంతో సరిపెట్టుకుంది. చైనా (79), పాకిస్తాన్‌ (80), నేపాల్‌ (99), బంగ్లాదేశ్‌ (110), ఇరాక్‌ (117), శ్రీలంక (120) స్థానాల్లో నిలిచా యి. నార్వే, డెన్మార్క్‌ తర్వాతి స్థానాల్లో ఐస్‌లాం డ్, స్విట్జర్లాండ్, ఫిన్‌లాండ్, నెదర్లాండ్స్, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, స్వీడన్‌ ఉన్నాయి. గతేడాది కంటే ఒక స్థానం తగ్గి అమెరికా 14వ స్థానం దక్కించుకుంది. 2012 నుంచి ఇంతవరకూ ఐదుసార్లు ఈ నివేదికల్ని విడుదల చేశారు.Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫైనల్లో పరాజితులు లేరు 

పోయిందే.. ఇట్స్‌గాన్‌..

పెట్‌ యువర్‌ స్ట్రెస్‌ అవే!

హత్య చేసి.. శవంపై అత్యాచారం

అమెరికా, రష్యాల మధ్య నూతన ఒప్పందం

విడాకులు కోరినందుకు భార్యను...

పర్యాటకులకు కొద్దిదూరంలోనే విమానం ల్యాండింగ్‌!

ప్రేయసి గొంతుకోసి ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో..

ప్రైమ్‌ డే సేల్ ‌: అమెజాన్‌కు షాక్‌

ఎయిరిండియాకు భారీ ఊరట

ప్రాచీన పిరమిడ్‌ సందర్శనకు అనుమతి

యాంగ్‌ యాంగ్‌ బీభత్సం.. ఎగిరెగిరి తన్నుతూ..

హఫీజ్‌ సయీద్‌కు బెయిల్‌

ఇటలీ టమోటాలకు నెత్తుటి మరకలు

వదలని వాన.. 43 మంది మృతి..!

బుర్ర తక్కువ మనిషి; అయినా పర్లేదు..!

ఫేస్‌బుక్‌కు రూ.34 వేల కోట్ల జరిమానా!

అక్రమ వలసదార్ల అరెస్టులు షురూ

సోమాలియాలో ఉగ్రదాడి

మొసలిని మింగిన కొండచిలువ!

స్త్రీల లోదుస్తులు దొంగిలించి.. ఆ తర్వాత...

కుక్క మాంసం తినొద్దు ప్లీజ్‌!

డర్టీ కారు పార్క్‌ చేస్తే రూ. 9 వేలు ఫైన్‌!

ఫేస్‌బుక్‌కు 500 కోట్ల డాలర్ల జరిమానా!

రెచ్చిపోయిన ఉగ్రమూకలు; 10 మంది మృతి!

పెళ్లికి ఇదేమీ ‘ఆహ్వానం’ బాబోయ్‌!

విమానంలో ఎగిరిపడ్డ ప్రయాణికులు

టర్కీ చేరిన రష్యా ఎస్‌–400 క్షిపణులు

దారిద్య్రం నుంచి విముక్తి చెందారు

యుద్ధవిమానాలు పోతేనే గగనతలం తెరుస్తాం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!