వరల్డ్ మోస్ట్ థ్రిల్లింగ్ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్

2 Apr, 2016 17:35 IST|Sakshi

ఏడుకొండలపై కొలువున్న శ్రీవేంకటేశ్వరుని వద్దకు వెళ్లేటప్పుడు పాము మెలికల తిరిగినట్లు వంకరటింకర రోడ్లలో ప్రయాణించడం, ఆ మార్గం గుండా క్షేమంగా దరి చేర్చమంటూ శ్రీవారిని భక్తులు వేడుకోవటం చాలామందికి అనుభవమే. తిరుమల కాబట్టి స్వామివారిని అడుగుతాం కానీ ఈ రోడ్లు, వంతెనలున్నాయి చూశారూ.. కొంచెం అటూ ఇటైనా ఏ దేవుడూ కాపాడలేడు.

ఒక్క అడుగు.. ఒకే ఒక్క తప్పటడుగు పడితే తునాతునకలైపోతారు. సున్నంలోకి ఎముకలు లేకుండా(నిజానికి ఎముకల్లో సున్నం మిగలకుండా) నుజ్జునుజ్జవుతారు. అలాంటి భయంకరమైన రోడ్డుమీద, ఏక్షణంలో విరిగిపడతాయో తెలియని మంచు చరియల మధ్య నుంచి, ప్రపంచంలో ఎత్తైన వంతెన పైనుంచి, అతి ఇరుకైన రోడ్డు.. థ్రిల్లింగ్ కే థ్రిల్లింగ్ కలిగించే ప్రయాణ మార్గాలివి. వీలైతే అక్కడికెళ్లి అదరగొట్టండి. లేదంటే ఫొటోల్నిచూసి ఆనందించండి.
(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

>
మరిన్ని వార్తలు