బ్రిటిష్ మ్యూజియంలో ఈజిప్టు అద్భుతాలు!

7 May, 2016 22:07 IST|Sakshi
బ్రిటిష్ మ్యూజియంలో ఈజిప్టు అద్భుతాలు!

ఫ్రెంచ్ పురాతత్వవేత్త గాడియో అద్భుత ఆవిష్కారాలు ఇప్పుడు బ్రిటిష్ మ్యూజియంలో సందర్శనకు సిద్ధమయ్యాయి. ప్రాచీన ఈజిప్టు నగరాల ఆనవాళ్ళు త్వరలో సందర్శకులకు కనువిందు చేయనున్నాయి.

సముద్రంలో మునిగిపోయి, ఎవ్వరికీ కనిపించకుండా పోయిన గొప్ప ఈజిప్టు నగరాలు ఎన్నో వేల సంవత్సరాలపాటు రహస్య నగరాలుగానే మిగిలిపోయాయి. కనిపించకుండా పోయిన ఆ నగరాలను పురాతత్వవేత్త ఫ్రాంక్ గాడియో కొన్నేళ్ళ క్రితం సముద్రానికి అడుగు భాగంలో కనిపెట్టిన విషయం తెలిసిందే. ఆ నగరాలకు సంబంధించిన అనేక అద్భుతాలను ఇప్పుడు సందర్శకులకు అందుబాటులో  బ్రిటిష్ మ్యూజియంలో ప్రదర్శనకు పెడుతున్నారు.

సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం సముద్రంలో మునిగిపోయిన థోనిస్ హెరాస్టెయిన్ నగరంలోని అద్భుత దేవాలయాలు, ప్రాచీన శిలాకృతులు గాడియో కనిపెట్టే వరకూ ఎవ్వరికీ కనిపించకుండా రహస్యంగా నీటి అడుగున నిక్షిస్తమైపోయాయి.  చేపలకు ఆవాసాలుగా మారిపోయాయి. ఆ నగరాలనుంచి సేకరించిన దేవతా విగ్రహాలు, శిల్ప సంపద ప్రస్తుతం ప్రపంచానికి పరిచయం కానున్నాయి. సంవత్సరాలకొద్దీ కాలం ఈ ప్రాచీన చిహ్నాలను గుర్తించేందుకు గాడియో  ఎంతో శ్రమించాడు. దీనికి తోడు కానోపస్ ను కూడ అంగుళం లోతు ఇసుకలో కూరుకుపోయి నీటి అడుగు భాగంలో ఉన్నట్లుగా 1933లో బ్రిటిష్ ఆర్ ఏ ఎఫ్ పైలట్ కనుగొన్నాడు. ప్రస్తుతం ఆ ఈజిప్టు అద్భుత శిలా సంపదను మే 19న ప్రదర్శనకు అందుబాటులోకి తేనున్నట్లు మ్యూజియం క్యూరేటర్ మాసెన్ బెర్గోఫ్ తెలిపారు. ప్రాచీన గ్రీకు చరిత్రకారులు, గ్రంథాలు, పురాణాలు వంటి ఎన్నో విశేషాలను ఇప్పుడు మ్యూజియంను సందర్శించిన వారు తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నారు.

మరిన్ని వార్తలు