గోడలకు పగుళ్లుండవ్!

21 Apr, 2014 03:29 IST|Sakshi

న్యూయార్క్: పగుళ్లు లేకుండా భవనాలు చిరకాలం ఉండేలా కొత్తరకం కాంక్రీట్‌ను పరిశోధకులు అభివృద్ధిపరిచారు. ‘సూపర్‌హైడ్రోఫోబిక్’గా పిలిచే ఈ కాంక్రీట్ తనలో ఉండే నీటిని విసర్జిస్తూ గోడలు మన్నికగా ఉండేందుకు తోడ్పడుతుంది. విస్కన్సన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు దీన్ని రూపొందించారు. ‘ఈ పరిశోధనలో మేం మంచి ఫలితాలను సాధించాం’ అని స్కాట్ ముజెన్‌స్కీ తెలిపాడు.  వీళ్లు రూపొందించిన కాంక్రీట్‌లో సెన్సార్‌లు అమర్చుతారు. ఇవి గోడల్లో వస్తున్న మార్పులను పరిశీలించడమే కాకుండా...పగుళ్లను సాధ్యమైనంతవరకు నిరోధించేందుకు ప్రయత్నిస్తుంది. ఒక వేళ నీటిచారలు, పగుళ్లు వచ్చే అవకాశం ఉంటే బ్లూటూత్, వై-ఫైల ఆధారంగా మనకు సందేశాలు కూడా పంపిం చి,  హెచ్చరికలు జారీచేస్తుంది.
 

మరిన్ని వార్తలు