టుటన్‌ఖమున్‌ సమాధిలో రహస్యగది లేదు!

7 May, 2018 22:04 IST|Sakshi
టుటన్‌ఖమున్‌ సమాధి

కైరో : 3000 ఏళ్ల క్రితం ఈజిప్టును పాలించిన ‘బాల రాజు’ టుటన్‌ఖమున్‌ సమాధి గుట్టు వీడింది. 19 ఏళ్ల వయసులోనే మరణించిన ఈ ఫారో పాలకుడి సమాధిలో అద్భుతమైన కళాఖండాలు, బంగారు ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలు బయటపడడంతో యావత్‌ ప్రపంచం దృష్టి సమాధిపై పడింది. సరిగ్గా ఇదే సమయంలో అందులో రహస్య గదులున్నాయన్న ప్రచారం కూడా జరిగింది. దీనికి స్థానిక అధికారులు కూడా ఉన్నాయన్నట్లుగానే సంకేతాలు పంపారు. అయితే సమాధిలో అటువంటి గదులేవీ లేవని తాజా పరిశోధనలో తేలింది. అది రహస్య గది కాదని, టుటన్‌ఖమున్‌ తల్లి రాణి నెఫ్రిటిటీదని చెబుతున్నారు.

2015లో ఇంగ్లిష్‌ ఆర్కియాలజిస్టు సమాధిపై సమగ్ర పరిశోధనలు జరిపి, ఆయా ప్రదేశాల చిత్రాలను స్కాన్‌ చేసి, ఓ పరిశోధన పత్రాన్ని విడుదల చేశారు. దాని ప్రకారం 3వేల ఏళ్ల క్రితం తన భర్త మరణం తర్వాత ఈజిప్టును నెఫ్రిటిటీ రాణి పాలించి, మంచి పాలకురాలిగా పేరుగాంచింది. అయితే చరిత్రలో ఎక్కడా ఆమె మరణం, సమాధి గురించి లేదని, తమ పరిశోధనలో మాత్రం ఈ సమాధిలోనే రాణి మృతదేహాన్ని, ఆమెకు సంబంధించిన ఆభరణాలను పెట్టారని పరిశోధన బృందానికి నేతృత్వం వహించిన ఫ్రాన్‌సెస్కో పోర్‌సెల్లీ తెలిపారు.

మరిన్ని వార్తలు