బ్రెగ్జిట్‌ ఓటింగ్‌ వాయిదా

11 Dec, 2018 04:35 IST|Sakshi

లండన్‌: బ్రెగ్జిట్‌పై పార్లమెంట్‌లో మంగళవా రం చేపట్టే ఓటింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు బ్రిటన్‌ ప్రధాని థెరెసా మే తెలిపారు. బ్రెగ్జిట్‌పై యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)తో తాను కుదుర్చుకున్న ఒప్పందంలోని అంశా లపై ఎంపీల్లో విభేదాలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం పార్లమెం ట్‌లో ప్రకటించారు. బ్రెగ్జిట్‌ తర్వాత కూడా ఈయూ కస్టమ్స్‌ యూనియన్‌లోనే బ్రిటన్‌ కొనసాగనుండడంపై ఎంపీల్లో ఆందోళన వ్యక్త మవుతోందని ఆమె తెలిపారు. ఈ పరిస్థి తుల్లో ఒప్పందంపై ఓటింగ్‌ పెడితే భారీ తేడాతో ఓడిపోయే ప్రమాదముందని మే అంగీకరిం చారు. సభ్యుల అభ్యంతరాలపై వచ్చే వారం జరగనున్న ఈయూ నేతల భేటీలో చర్చించి, ప్రజలకు ప్రయోజనం కలిగే విధంగా హామీ పొందేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు