ఈయూపై ట్రంప్‌ కేసు వేయమన్నారు

16 Jul, 2018 03:05 IST|Sakshi
బ్రిటన్‌ ప్రధాని థెరెసా మే

బ్రిటన్‌ ప్రధాని థెరెసా మే

లండన్‌: బ్రెగ్జిట్‌ విషయంలో యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)తో చర్చలకు బదులు దానిపై కేసు వేయాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తనకు సూచించారని బ్రిటన్‌ ప్రధాని థెరెసా మే ఆదివారం వెల్లడించారు. నాలుగు రోజుల బ్రిటన్‌ పర్యటనలో భాగంగా ట్రంప్‌ శుక్రవారం మేతో భేటీ అవ్వడం తెలిసిందే. అంతకు రెండ్రోజుల ముందు కూడా.. మే అనుసరిస్తున్న బ్రెగ్జిట్‌ వ్యూహాలను ట్రంప్‌ విమర్శించారు.

శుక్రవారం సంయుక్త విలేకరుల సమావేశంలో ట్రంప్‌ మాట్లాడుతూ ‘ఈయూతో ఎలా వ్యవహరించాలనే దానిపై నేను థెరెసాకు ఓ సలహా ఇచ్చాను. ఆమెకు అది బహుశా క్రూరమైనదిగా, చాలా క్లిష్టమైనదిగా అనిపించవచ్చు’ అని అన్నారు. ఆ సలహా ఏంటో చెప్పాలని ఓ విలేకరి ఆదివారం మేను కోరగా ‘నేను ఈయూతో చర్చలు జరపకుండా దానిపై కేసు వేయాలని ఆయన చెప్పా రు’ అని అన్నారు. అయితే తాను ఈయూతో చర్చలతోనే ముందుకెళ్తాననీ ఆమె చెప్పారు.

మరిన్ని వార్తలు