‘జలియన్‌వాలాబాగ్‌ అవమానకరం’

11 Apr, 2019 09:34 IST|Sakshi

లండన్‌: 1919లో అమృత్‌సర్‌లో జరిగిన జలియన్‌వాలాబాగ్‌ దురంతం బ్రిటిష్‌ పాలనలోని భారత చరిత్రలో అవమానకర మరకగా మిగిలిపోతుందని బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే అన్నారు. పలువురు పార్లమెంట్‌ సభ్యులు డిమాండ్‌ చేసినట్లుగా ఈ ఘటనపై అధికారికంగా క్షమాపణ చెప్పడానికి ఆమె నిరాకరించారు. ఈ నెల 13న జలియన్‌వాలాబాగ్‌ ఘటనకు వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా పార్లమెంట్‌లో చర్చలో ఆమె మాట్లాడారు.

‘ఆనాటి ఘటనపై తీవ్రంగా చింతిస్తున్నాం. అయినా నేడు భారత్‌–బ్రిటన్‌ సంబంధాలు సంతృప్తికరం. బ్రిటన్‌ అభివృద్ధిలో భారతీయుల కృషి అమోఘం’ అని అన్నారు. స్వాతంత్య్రపోరాటంలో భాగంగా భారతీయులు రహస్యంగా సమావేశమైనప్పుడు జనరల్‌ డయ్యర్‌ నేతృత్వంలోని సేనలు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 379 మంది చనిపోగా, 1200 మంది గాయపడ్డారు. 

మరిన్ని వార్తలు