బ్రెగ్జిట్‌పై ఓ ఒప్పందానికి వద్దాం: థెరిసా మే

6 May, 2019 02:29 IST|Sakshi

లండన్‌: ఐరోపా యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగిన నేపథ్యంలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సంక్షోభానికి తెరదించేందుకు అధికార కన్జర్వేటివ్‌ ప్రభుత్వం, విపక్ష లేబర్‌ పార్టీ ఒక రాజీ బ్రెగ్జిట్‌ ఒప్పందానికి రావాల్సిన అవసరం ఉందని బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే చెప్పారు. ఆదివారం పార్టీ పత్రిక మెయిల్‌ ఆన్‌ సండేలో ఆమె ఈ మేరకు రాశారు. ‘ఓ ఒప్పందానికి వద్దాం’అని లేబర్‌ పార్టీ నేత జెర్మయి కార్బైన్‌ను ఉద్దేశించి ఆమె పిలుపునిచ్చారు. పార్టీల రాజీ అవకాశంపై అధికార పార్టీ నేతల్లో కొంత ఆందోళన వ్యక్తమైంది. చివరకు మే కూడా తాను కూడా అలా కోరుకోవడం లేదన్నారు. ‘కానీ సంక్షోభాన్ని సడలించే మార్గాన్ని కనుక్కోవాల్సి ఉంది. అంతేకాదు స్థానిక ఎన్నికల ఫలితాలు కూడా దాని అత్యవసరతను పేర్కొంటున్నాయి..’అని బ్రిటన్‌ ప్రధాని లేఖ రాశారు. 

మరిన్ని వార్తలు