'లావుగా ఉంటే ఆ భయం అవసరం లేదు'

20 Jul, 2016 11:09 IST|Sakshi
'లావుగా ఉంటే ఆ భయం అవసరం లేదు'

సాధారణంగా యోగా అనగానే మనకు గుర్తొచ్చేది.. నాజుకైన అమ్మాయిలు. ఉదాహరణగా చెప్పాలంటే ఏ బిపాసా బసునో.. శిల్పాశెట్టినో మరింకెవరైనా సన్నగా ఉండే ముద్దుగుమ్మలే ఈ యోగా చేయగలరని ఆలోచన వస్తుంది. లావుగా ఉన్నవాళ్లు అంత ఆరోగ్యంగా ఉండరని.. యోగా చేయడానికి వారి దేహాలు సహకరించవనే అపోహలు ఉన్నాయి. అయితే, ఇక ఈ ఆలోచనలకు స్వస్తి చెప్పాల్సిందే. ఎందుకంటే జెస్సీ మిన్ అనే ఓ ఆఫ్రికా జాతికి చెందిన యువతి ఆ ఆలోచనలు ఉత్త అపోహలే అని స్పష్టం చేసింది. భారీ దేహం ఉన్నప్పటికీ స్లిమ్ పర్సనాలిటీ ఉన్నవాల్లకంటే కూడా గొప్పగా యోగాసనాలు వేస్తోంది.

అంతేకాదు తన యోగాసనాలను ప్రముఖ సామాజిక అనుసంధాన వేదిక ఇన్ స్టాగ్రమ్లో పంచుకుంది. ఈ ఫొటోలతో ఫిట్ నెస్ అనేది శరీరంతో ముడిపెట్టి చూసే అంశం కాదని ఆమె స్పష్టం చేసింది. 'యోగా నేర్చుకున్న తర్వాత అనవసరంగా నేను నా శరీరాకృతిని గురించి ఇన్నాళ్లు భయపడ్డానని తెలిసింది. చాలామంది కూడా నాలాగే ఎన్నో భ్రమల్లో ఉంటారు. కానీ, యోగాతో అవన్నీ పోతాయి. ఇది నా విషయంలో రుజువు అయింది' అని జెస్సీ చెప్పింది. 24 ఏళ్ల వయసున్న జెస్సీ తన మిత్రురాలి ద్వారా బిక్రం యోగా స్టూడియోకి వెళ్లి యోగా నేర్చుకుంది. 

మరిన్ని వార్తలు