15 సెకన్లకే.. రెండు కిలోమీటర్లు

5 Oct, 2016 08:55 IST|Sakshi
15 సెకన్లకే.. రెండు కిలోమీటర్లు

జెనీవా: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొలది మనిషి వేగం కూడా ఆలోచనంత వేగంగా కదులుతోంది. ఇందుకు సాక్ష్యంగా వచ్చే ఏడాది జెనీవాలో మారనున్న ప్రజా రవాణా వ్యవస్థ కనిపించనుంది. అవును.. 2017 నుంచి జెనీవాలో ప్రజా రవాణాలో విప్లవాత్మక మార్పు రానుంది. రెండు కిలో మీటర్ల దూరాన్ని 15 సెకన్ల చార్జింగ్తో ముగించేయగల బస్సులను ప్రజా రవాణాకోసం జెనీవా సిద్దం చేస్తోంది. ఈ బస్సులకోసం ఉపయోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం పర్యావరణానికి హానీ కలిగించనిదట. ఇదే పరిజ్ఞానాన్ని కొంతమంది భారతీయ పర్యావరణ వేత్తలు విజ్ఞప్తి మేరకు వారికి కూడా అందించే ఆలోచన చేస్తున్నారట.

జెనీవాలో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వాహనాల నిర్వహణ సంస్థ టీజీపీ, జెనీవా పవర్ యుటిలిటీ సిగ్ అండ్ ఏబీబీ సంయుక్త ఆధ్వర్యంలో వీటిని అభివృద్ది చేస్తున్నాయి. ఈ బస్సులు చూడ్డానికి యూరోపియన్ దేశాల్లోని ఎలెక్ట్రిక్ ట్రాలీ బస్సుల మాదిరిగానే ఉంటాయి. అయితే, వాటికి బస్సు వెళ్లే మార్గంలో ప్రత్యేక పవర్ పోల్స్ ఉండగా దీనికి మాత్రం బస్సుకు పైనే ఒక పెద్ద ప్యానెల్ ఉంటుంది. అందులో బస్సుకు అవసరమైన బ్యాటరీ ఉంటుంది. ప్రతి రెండు కిలో మీటర్లకు ఒక బస్ స్టాపు ఉండగా అందులో ఆ బస్సుకు చార్జింగ్ పెట్టుకునే అవకాశం ఏర్పాటుచేస్తారు. మాములుగా అయితే, గంటలకొద్ది చార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. కానీ, ఈ బస్సులకు మాత్రం 15 సెకన్లు చార్జింగ్ పెడితే రెండు కిలోమీటర్లు సునాయాసంగా పరుగెడతాయి. నగరంలో లోపల ఇలాంటి బస్సులు ఎక్కువ మేలును కలిగించనున్నాయి.

మరిన్ని వార్తలు