ఈ జన్యువే ‘మూలం’!

20 Jul, 2014 02:53 IST|Sakshi

వాషింగ్టన్: శరీరానికి సంబంధించి ఏ రకమైన కణాలుగా అయినా మారగల ‘మూల కణాలు’ అభివృద్ధి చెందేందుకు, అవి రూపొందేందుకు తోడ్పడే జన్యువును అమెరికాకు చెందిన మిషిగన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు.  దీనికోసం మానవ అండం (ఊసైట్)లోని 5 వేలకుపైగా జన్యువులను విశ్లేషించారు. వీటిల్లో ‘ఏఎస్‌ఎఫ్1ఏ’ అనే జన్యువును కణాలు మరో రకమైన కణాలుగా మారేందుకు (రీప్రోగ్రామింగ్‌కు) తోడ్పడుతాయని గుర్తించారు.

‘ఏఎస్‌ఎఫ్1ఏ’ జన్యువు ‘ఓసీటీ4’ అనే మరో జన్యువు సహాయంతో కణాల రీప్రోగామింగ్‌కు కారణమవుతోందని, మూలకణాలు ఎలా అభివృద్ధి చెందుతాయనే అంశాన్ని పరిశీలించడంలో ఇదో పెద్ద ముందడుగని పరిశోధనకు నేతృత్వం వహించిన ఎలీనా గోంజాలెజ్-మునోజ్ తెలిపారు. దీని సాయంతో సాధారణ చర్మకణాలను మూలకణాలుగా ఎలా మార్పు చేయవచ్చనే దానిపై పరిశోధన చేస్తున్నామని పేర్కొన్నారు.
 
 

మరిన్ని వార్తలు