ఇదండీ విచిత్ర జీవి సంగతి!

1 Jul, 2017 02:37 IST|Sakshi
ఇదండీ విచిత్ర జీవి సంగతి!
గుర్రం లాంటి ముఖం, నీటి ఏనుగు కాళ్లు, మోపురం లేని ఒంటె లాంటి దేహంతో ఉన్న ఈ జీవిని చూసేందుకు చిత్రంగా ఉంది కదూ. నిజమే.. మానవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన చార్లెస్‌ డార్విన్‌కే దీని వివరాలు అంతుపట్టలేదు. జన్యుక్రమ విశ్లేషణ పుణ్యమా అని ఇన్నేళ్ల తరువాత ఈ జీవి వివరా లు తొలిసారి వెల్లడయ్యాయి. దక్షిణ అమెరికాలో డార్విన్‌ పర్యటిస్తున్నప్పు డు పెటగోనియాలో ఈ జీవి తాలూ కూ అవశేషాలు లభించాయి. వాటి ఆధారంగా బతికున్నప్పుడు ఆ జీవి ఎలా ఉండేదో ఊహించిన డార్విన్‌ దానికి మక్రావుచెనియా పాటాకోనికా అని నామకరణం చేశాడు. పేరుపెట్టగలిగాడేగానీ ఇతర వివరాలేవీ తెలియరాలేదు.

ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ఆఫ్‌ పోస్ట్‌డ్యామ్‌ అధ్యాపకుడు మైకేల్‌ హోఫ్రిటర్‌ దీనిపై పరిశోధనలు చేపట్టారు. అవశేషాల ద్వారా సేకరించిన మైటోకాండ్రియల్‌ డీఎన్‌ఏను విశ్లేషించినప్పుడు ఈ జీవజాతి రాక్షస బల్లుల కాలంలో ఉండేదని, గుర్రం, నీటిఏనుగు వంటి పెరిస్సోడాక్యాటా జాతికి చెందిందని గుర్తించగలిగారు. పరిశోధన వివరాలు నేచర్‌ కమ్యూనికేషన్స్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.  
మరిన్ని వార్తలు