అలా లేకుంటే విమానాలు కూలిపోతాయి

22 Feb, 2016 09:31 IST|Sakshi
అలా లేకుంటే విమానాలు కూలిపోతాయి

ఒక వస్తువు నిర్మాణానికి కొన్ని ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాలు దృష్టిలో పెట్టుకొని దాన్ని రూపొందించకుంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. అందుకే, ప్రతిపనికి భవిష్యత్ అంచనాలు, గతంలోని పరాభావాలు, ప్రస్తుత అనుభవాలు మేళవించుకొని ఒక వస్తువును రూపొందిస్తారు. అది చూసేందుకు తేలికగా అనిపించినా, పెద్దగా ఆలోచింపలేకపోయినా అసలు కథ తెలిస్తే మాత్రం అవునా.. అలాగా అని ఆసక్తిగా అనుకోవాల్సిందే. సాధారణంగా మనం విమానాలు చూస్తుంటాం. కొందరికైతే వాటిలో ప్రయాణించిన అనుభవం కూడా ఉండి ఉండేఉంటుంది.

ఆ సమయంలో గమనించారో లేదో ఏ విమానానికి చూసిన దాని కిటికీలు గుండ్రంగా ఉంటాయి. అసలు విమానాల కిటికీలు ఎందుకు గుండ్రంగా ఉంటాయో ఆలోచించారా.. అలా ఉండటం వల్ల మతలబు ఏమిటి? ఎప్పటి నుంచి వాటిని గుండ్రంగా తయారుచేయడం మొదలుపెట్టారు? వాటిని చతురస్రాకారంలోనో, దీర్ఘ చతురస్రాకారంలోనో, త్రిభుజాకారంలోనో ఎందుకు తయారు చేయలేదు? అని పరిశీలిస్తే.. దాని వెనుక అసలు కథ తెలిసింది. అది 1950. అప్పుడు జెట్ లైనర్ విమానాలు బాగా ట్రెండింగ్. ఇవి మిగతా విమానాల కన్నా వేగంగా దూసుకెళ్లగల లక్షణాలు కలిగి ఉండటంతోపాటు ఎంతో ఒత్తిడినితట్టుకోగలవి.

కానీ,దీని కిటికీలు మాత్రం చతురస్రాకారంలో ఉన్నాయి. అయితే, అనుహ్యంగా ఇదే జెట్ లైనర్ విమానాలు 1953లో కూలిపోయి 56 మంది ప్రాణాలు విడిచారు. ఇలా ఎందుకు జరిగి ఉంటుందని విచారణచేస్తే ఆ విమాన కిటికీలే సమస్య అని తెలిసింది. సాధారణంగా చతురస్రాకరంలో ఉంటే వాటికి కోణాలు ఉంటాయిని, ఒక్కోకోణం ఒక్కో బలహీనత ఉండి అక్కడ లోపలికి గాలి చొచ్చుకొచ్చి విండో పగిలిపోయి అవకాశం నాలుగు రెట్లు ఎక్కువగా ఉండి విమానాన్ని కూలిపోయేలే చేస్తుందని వారు గుర్తించారు. దీంతో అప్పటి నుంచి విమానాల కిటికీలు గుండ్రంగా రూపొందించడం మొదలు పెట్టారు. అలా ఉండటం వల్ల ఒత్తిడి అనేది ఒక చోట కేంద్రీకృతం కాకుండా విండో చుట్టూ తిరిగి బయటకు వెళ్లిపోతుంది. తక్కువ ఒత్తిడి మాత్రమే విండోస్పై పడి విమానాలు సురక్షితంగా ఉంటాయి.

మరిన్ని వార్తలు