మీ చెయ్యే టచ్ ప్యాడ్ గా మారితే..!

6 May, 2016 20:04 IST|Sakshi
మీ చెయ్యే టచ్ ప్యాడ్ గా మారితే..!

ఇప్పటివరకు టచ్ ప్యాడ్‌ను వస్తువు స్క్రీన్ మీద ఉపయోగిస్తూ వచ్చాం. త్వరలో గాలిలో కూడా టచ్ చేయొచ్చనే విషయాన్ని సైతం విన్నాం. కానీ, మన చేతి మీద టచ్ చేస్తే కదిలే ఆప్షన్లను ఎప్పుడైనా చూశారా? ఇప్పుడు చూసేయండి. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రజ్ఞులు ఈ తరహా వాచీని తయారుచేశారు.

అదేంటి చేతిమీద టచ్ చేయొచ్చని.. వాచీ అంటున్నారు అనుకుంటున్నారా..? ఆ వాచీని చేతికి పెట్టుకుని మీ మరో చేతి వేలికి ఉంగరాన్ని పెట్టుకుని వాచీ పెట్టుకున్న చేతిమీద టచ్ చేస్తే చాలు.. వాచీలో అప్లికేషన్స్ ఓపెన్ అయిపోతాయి. సాధారణ టచ్ ఫోన్ మాదిరిగానే మనం ఆ వాచీని చేతి మీద టచ్ చేస్తూ ఉపయోగించుకోవచ్చు. ఉంగరాన్ని ధరించిన వేలు చర్మాన్ని తాకినపుడు వాచీలో అమర్చి ఉన్న వస్తువులకు తక్కువ, ఎక్కువ ఫ్రీక్వెన్సీ రేంజిలతో తరంగాలు చేరి టచ్ రన్ అవుతుందని పరిశోధకులు వివరించారు.

మరిన్ని వార్తలు