డాక్టర్‌ని చేతికి కట్టేసుకోండి!

12 Dec, 2016 14:57 IST|Sakshi
డాక్టర్‌ని చేతికి కట్టేసుకోండి!

వాచీలు బాగానే ఉన్నారుు గానీ... వాటిపై ఆ అక్షరాలేమిటి? గ్రాఫులేమిటి? ఇదేనా మీ సందేహం. ఈ క్రొనోవో వాచీ మీ ఆరోగ్య వివరాలు మొత్తం మీ చేతుల్లో ఉంచుతుంది. స్మార్ట్‌ఫోన్ల స్థాయిలో ఏర్పాటు చేసిన 1.2 గిగాహెర్‌ట్జ్ డ్యూయల్ కోర్ మైక్రోప్రాసెసర్.. ఒక జీబీ ర్యామ్, నాలుగు జీబీల మెమరీలతో ఈ వాచీ ఎన్ని పనులు చేయగలదో చూడండి. అడుగున ఉండే చిన్నసైజు ఎలక్టోడ్ర్‌లతో ఇది మీ గుండె పనితీరును సూచించే ఈకేజీ గ్రాఫ్‌ను చూపుతుంది.

మీ ఆరోగ్య పరిస్థితికి తగ్గట్టుగా ఎలాంటి వ్యాయామాలు చేయాలో సూచిస్తుంది. నడిచే అడుగులు లెక్కపెడుతుంది.. సుఖ నిద్రపైనా ఒక కన్నేసి ఉంచుతుంది. ఉచ్ఛ్వాస, నిశ్వాసాల తీరుతోపాటు మీ గుండెచప్పుళ్లల్లో వచ్చే తేడాలనూ పసిగట్టి హెచ్చరిస్తుంది. ఈ పనులన్నీ చేసేందుకు అవసరమైన గైరోస్కోపు, యాక్సెలోమీటర్, ఇతర సెన్సర్లు దీంట్లో ఉన్నాయి. ఆండ్రారుుడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లు రెండింటితోనూ పనిచేసే క్రోనోవో వాచీ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రస్తుతానికి దీన్ని వాణిజ్య స్థాయిలో తయారు చేసేందుకు నిధులు సమీకరిస్తున్నారు. దాదాపు రూ.14 వేలు ఖరీదు చేయగల ఈ హైటెక్ వాచీ టైమ్‌ను ఎటూ చూపిస్తుంది. సంగీతమూ వినిపిస్తుందండోయ్!

>
మరిన్ని వార్తలు