నమ్మండి.. కొత్త ట్రెండ్‌ ఇదేనండీ!

23 Oct, 2017 15:51 IST|Sakshi
టాక్‌ ఆఫ్‌ ది ఫ్యాషన్‌ ఇండస్ట్రీ ‘తొంగ్‌ జీన్స్‌’ను ప్రదర్శిస్తోన్న మోడల్‌.

టోక్యో : ‘అన్నవస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయాయట’ అన్న చందంగా పాపులారిటీ కోసం పాకులాడి ఉన్న పేరు కూడా ఖరాబ్‌ చేసుకున్నడు డిజైనర్‌ మెయికో బాన్‌. ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకునే ఫ్యాషన్‌ ఇండస్ట్రీకి తానేంటో చూపిద్దామని ఆయన చేసిన ప్రయత్నం తీవ్ర విమర్శలపాలైంది.

‘తొంగ్‌ జీన్స్‌’  పేరుతో బాన్‌ రూపొందించిన ఈ దుస్తుల్ని ఇటీవల టోక్యోలో జరిగిన అమెజాన్‌ ఫ్యాషన్‌ వీక్‌లో ప్రదర్శించారు. ఫస్ట్‌లుక్‌లోనే చూపరులకు కిరాక్‌ పుట్టించింది తొంగ్‌ జీన్స్‌. అటు సోషల్‌ మీడియాలోనూ దీనిపైనే చర్చ.

‘తొంగ్‌ జీన్స్‌.. డెనిమ్‌ పరువును మంటగలిపింది’ అని ఒకరు,  ‘నమ్మండి.. ఇప్పుడిదే కొత్త ట్రెండ్‌.. అన్న వార్త చూసిన వెంటనే ఫోన్‌ను తగలబెట్టి, ఆఫ్రికా బయలుదేరా’​ అని మరొకరు, ‘దేవుడి దయ.. ఇలాంటి జీన్స్‌ వేసుకునే అదృష్టం నాకు లేదు’ అని ఇంకొకరు.. ఇలా వందలమంది తొంగ్‌ జీన్స్‌పై చలోక్తులు విసురుతున్నారు. కాగా, డిజైనర్‌ బాన్‌ మాత్రం ‘ఫ్యాషన్‌ ఇండస్ట్రీకి ఏం కావాలో నేను అదే ఇచ్చాను’ అని గర్వంగా చెప్పుకుంటున్నారు!
 

Poll
Loading...
మరిన్ని వార్తలు