ఐఎస్‌ఎస్‌ వద్ద కనిపించింది ఏలియన్లేనా?

9 Sep, 2017 11:16 IST|Sakshi
ఐఎస్‌ఎస్‌ వద్ద కనిపించింది ఏలియన్లేనా?

సాక్షి, ప్రత్యేకం: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌) కిందిగా ఆకాశంలో ప్రయాణించిన మూడు వింత ఆకారాలు కాన్‌స్ఫిరసీ థియరిస్టులను ఆశ్చర్యపోయేలా చేశాయి. ఇందుకు సంబంధించిన వివరాలను కాన్‌స్ఫిరసీ థియరిస్టులు బ్రెట్‌, బ్లేక్‌లు బయటపెట్టారు. అయితే, అవి ఏలియన్లా? కాదా? అన్న అంశాలను మాత్రం బయటపెట్టలేదు.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కిందుగా వింత ఆకారాలు ప్రయాణిస్తున్న సమయంలో వీడియో తీసినట్లు చెప్పారు. అయితే, బ్రెట్‌, బ్లేక్‌లు తీసిన వీడియోను తిలకించిన వారు మాత్రం.. అవి స్పేస్‌షిప్‌ లేదా మేఘాలు అయ్యుంటాయని కామెంట్స్‌ చేశారు.