హైవేపై మూడు కళ్ళ పైథాన్‌..ఫోటోలు వైరల్‌

2 May, 2019 15:09 IST|Sakshi

త్రినేత్రుడు లాగా..మూడు కళ్ల  సర్పం  ఒకటి  నెటిజనులను ఆకట్టుకుంటోంది. ఆస్ట్రేలియాలో మూడు కళ్లు ఉన్న పామును గుర్తించారు. ఉత్త‌ర ఆస్ట్రేలియాలో వ‌న్య‌ప్రాణి అధికారులు  ఈ  పాము ఫోటోలను త‌మ ఫేస్‌బుక్ పేజిలో  పోస్టు చేశారు. దీంతో ఈ ఫోటోలు వైరలయ్యాయి. 8 వేలకు పైగా కమెంట్లను,  14వేలకు పైగా షేర్లను సాధించింది. 

డార్విన్ స‌మీపంలోని అర్న్‌హెమ్ హైవేపై మొద‌టిసారి చూసిన ఈ సర్పాన్ని కార్పెట్ పైథాన్‌గా గుర్తించారు. మార్చి నెల‌లో ఇది అట‌వీ అధికారుల‌కు చిక్కింది. పాము త‌ల‌పై ఉన్న మూడ‌వ క‌న్ను కూడా ప‌నిచేస్తున్న‌ట్లు తొలుత వైల్డ్‌లైఫ్ అధికారులు గుర్తించారు. స‌ర్పానికి ఎక్స్‌రే తీసిన అధికారులు మ‌రో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యాన్ని కూడా వెల్ల‌డించారు. పాము త‌ల‌లో రెండు పుర్రెలు లేవ‌నీ ఒకే పుర్రెపై మూడు కండ్లు ఉన్న‌ట్లు తేల్చారు. స‌హ‌జ‌సిద్ద‌మైన జ‌న్యు మ్యుటేష‌న్ వ‌ల్ల ఇలా మూడు కండ్లు వ‌చ్చి ఉంటాయ‌ని అంచ‌నా వేశారు.

ఇది చాలా అసాధారణమైందని, వైకల్యంతోనే జీవిస్తూ ఆహారం కోసం ఇబ్బందులు పడుతూ, రోడ్డు మీదకు వచ్చిందని  ఫారెస్ట్‌ రేంజర్ రే చాటో తెలిపారు.  అయితే దురదృ​‍ష్ట వశాత్తూ గుర్తించిన కొన్ని రోజుల్లోనే ఇది చ‌నిపోయిన‌ట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు