అంద‌రూ చూస్తుండ‌గా జూ ఉద్యోగిని చంపిన పులి

6 Jul, 2020 08:07 IST|Sakshi

జ్యూరిచ్‌‌: జూ ఉద్యోగినిపై పులి దాడి చేసి చంపేసిన ఘ‌ట‌న శ‌నివారం స్విట్జ‌ర్లాండ్‌లో చోటు చేసుకుంది. జ్యూరిచ్‌ జూలో సైబీరియ‌న్ జాతి పులి ఉంది. దాని ఎన్‌క్లోజ‌ర్‌లోకి ఓ మ‌హిళా ఉద్యోగి ప్ర‌వేశించింది. దీంతో అక్క‌డే ఉన్న పులి వెంట‌నే ఆమె మీద ప‌డి దాడి చేసింది. దీంతో అక్క‌డ ఉన్న ప్రేక్ష‌కులు ఒక్క‌సారిగా భ‌యాందోళ‌న‌కు గురై  పెద్ద ఎత్తున అరుపులు, కేకలు పెట్ట‌డంతో ఆ ప్రాంతం ప్ర‌తిధ్వ‌నించింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన ఇత‌ర జూ అధికారులు వెంట‌నే ఎన్‌క్లోజ‌ర్ ద‌గ్గ‌ర‌కు ప్ర‌వేశించి పులి దృష్టి మ‌ర‌ల్చే ప్రయ‌త్నం చేశారు. కానీ అప్ప‌టికే స‌హ‌చ‌ర ఉద్యోగిని పులి చేతిలో ప్రాణాలు విడిచింది. దీంతో ఆదివారం నాడు జూను తాత్కాలికంగా మూసివేశారు. (గాయపడిన పులి జాడేది..?)

ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు జ‌రుగుతుండ‌గా.. పులి మెల‌కువ‌గా ఉన్న స‌మ‌యంలో ఆమె ఎన్‌క్లోజ‌ర్‌లోకి ఎందుకు వెళ్లింది? అన్న విష‌యంపైనా ఆరా తీస్తున్నారు. కాగా 2015లో డెన్మార్క్‌లోని జంతుప్ర‌ద‌ర్శ‌న‌శాల‌లో జ‌న్మించిన ఈ పులి పేరు ఐరినా. దీన్ని గ‌తేడాది జ్యూరిచ్ జూకు తీసుకువ‌చ్చారు. ఇక జూలోని జంతువులు మ‌నుషుల‌పై దాడికి దిగ‌డం కొత్తేమీ కాదు. 2019లోనూ జంతు ప్ర‌ద‌ర్శ‌న‌శాల‌లో ఉన్న మొస‌లి అక్క‌డి ప్ర‌దేశాన్ని శుభ్రం చేయ‌డానికి వ‌చ్చిన ఉద్యోగి చేయి నోట క‌రిచింది. దాన్ని వ‌దిలించ‌డానికి ఎంత‌గా ప్ర‌య‌త్నించినా ఫ‌లితం లేక‌పోవ‌డంతో మొస‌లిని కా‌ల్చివేశారు. (మహిళపై సింహాల దాడి)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు