నడిరోడ్డుపై పెద్దపులి!

9 Mar, 2016 08:40 IST|Sakshi
నడిరోడ్డుపై పెద్దపులి!

దోహా: రోడ్డుపై వెళ్తుంటే అకస్మాత్తుగా పెద్దపులి ఎదురైతే ఎలా ఉంటుంది. పై ప్రాణాలు పైనే పోతాయి కదూ. ఖతర్ రాజధాని దోహాలో ఓ రోడ్డుపై మంగళవారం సరిగ్గా ఇదే జరిగింది. రద్దీగా ఉన్న రోడ్డు మీద వెళ్తున్న వారికి పులి ఎదురైంది. దీంతో ఒక్కసారిగా  వాహనదారులు కంగారు పడటంతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో రావటంతో ఖతర్ ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది.

రోడ్డుపై వెళుతున్న ఓ ట్రక్కులో నుంచి పులి రోడ్డుపైకి దూకినట్లగా ఆ ఫోటేజీలో కనిపిస్తోంది. దీంతో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఆ పులిని  తరలిస్తున్న సమయంలో రోడ్డుపైకి దూకినట్లు భావిస్తున్నారు. దీనిపై.. ఇటీవల ఖతర్లోని సంపన్న కుటుంబాలకు పులులను పెంచుకోవటం ఓ హాబీగా మారిందని సోషల్ మీడియాలో మిమర్శలు వస్తున్నాయి. తరువాత ఆ పులిని సురక్షితంగా పట్టుకొన్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఆ పులి యజమాని ఎవరనేది మాత్రం ఇంతవరకూ తెలియరాలేదు.
 

మరిన్ని వార్తలు