జన్మతః అమెరికా పౌరుడై ఉండాలి..

23 Oct, 2016 02:47 IST|Sakshi
జన్మతః అమెరికా పౌరుడై ఉండాలి..

అమెరికా అధ్యక్ష పదవికి ప్రతి నాలుగేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. ఈ ఏడాది జరగబోయే ఎన్నికలు 58వ అధ్యక్ష ఎన్నికలు. నవంబర్ నెలలో తొలి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం నాడు (ఈ ఏడాది నవంబర్ 8వ తేదీ) ఎన్నికలు నిర్వహిస్తారు. 1845 నుంచీ ఇలాగే జరుగుతోంది. వీటితో పాటు సమాఖ్య (కేంద్ర), రాష్ట్ర, స్థానిక ఎన్నికలు కూడా జరుగుతాయి.

వీటిని సాధారణ ఎన్నికలుగా పరిగణిస్తారు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయటానికి ఆ దేశంలోనే జన్మించిన పౌరులే అర్హులు. వయసు 35 ఏళ్లు నిండాలి. కనీసం పద్నాలుగేళ్ల పాటు అమెరికాలో నివసించి ఉండాలి. రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తికి మూడోసారి అధ్యక్ష పదవికి పోటీపడే అర్హత ఉండదు.

whatsapp channel

మరిన్ని వార్తలు