మిషన్ ఇంపాజిబుల్..

6 Nov, 2014 04:27 IST|Sakshi
మిషన్ ఇంపాజిబుల్..

 భూమికి 5 వేల అడుగుల ఎత్తులో సైనిక విమానంపై హీరో సాహసోపేతమైన స్టంట్స్.. చూస్తేనే రోమాలు నిక్కబొడుస్తాయి.. మరి అవి నిజంగా చేస్తేనో.. ఈ ఫొటోలోని సీన్ అదే. హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ మిషన్ ఇంపాజిబుల్-5 చిత్రం కోసం డూప్ లేకుండా చేసిన స్టంట్స్ తాలూకు ఫొటో ఇది. వేగంగా దూసుకుపోతున్న సైనిక విమానంపై కేవలం రెండు తాళ్ల సపోర్టుతో నిలబడి స్టంట్స్ చేయడమంటే మాటలా మరి. ఈ మధ్య బ్రిటన్‌లో ఈ సన్నివేశాలను చిత్రీకరించారు. సినిమాల్లో ఓ నటుడు డూప్ లేకుండా చేసిన అత్యంత సాహసవంతమైన స్టంట్ ఇదేనని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు