టీవీ ఎక్కువగా చూస్తున్నారా.. చావుకు దగ్గరైనట్టే

26 May, 2018 09:14 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మాంచెస్టర్‌ : తీరిక సమయంలో చాలా మంది చేసే పని టీవీ చూడటం. రిలాక్స్‌ కావడానికి అయితే ఫరవాలేదు కాని అదే పనిగా టీవీకి అతుక్కుపోతే మాత్రం చావుకు దగ్గరవ్వటమే అంటున్నారు పరిశోధకులు. ఎక్కువ సమయం టీవీ తెరను అదేపనిగా చూడటం వల్ల గుండె సంబంధ వ్యాధులు, క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువంటున్నారు. స్కాట్‌లాండ్‌కు చెందిన ‘‘యూనివర్శిటీ ఆఫ్‌ గ్లస్గో’’ జరిపిన ఓ పరిశోధనలో ఈ విషయాలు బహిర్గతమయ్యాయి. గ్లస్గో విశ్వవిద్యాలయం దాదాపు 4 లక్షల మందితో అతిపెద్ద సర్వేని నిర్వహించింది. శారీరికంగా దృఢంగా లేని వాళ్లు, కండరాళ్ల సత్తువ లేని వాళ్లు మరింత ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది.

ఎక్కువ సేపు అలా టీవీ తెరను చూస్తూ ఉండటం వల్ల గుండె సంబంధ, ప్రేగు క్యాన్సర్‌, డయాబెటీస్‌, ఒబిసిటీ వంటి వ్యాధులు దాడి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని వెల్లడైంది. ఇంకో విషయం ఏంటంటే ఇది కేవలం టీవీ తెరకు మాత్రమే కాదు కంప్యూటర్‌ తెరకు కూడా వర్తిస్తుంది. అయితే ఈ ప్రభావం విషయానికి వస్తే అందరిపై ఒకే విధంగా ఉండదు. టీవీ, కంప్యూటర్‌ ను చూస్తున్నపుడు ఎంత విరామం తీసుకుంటున్నారు. శారీరకంగా వారు ఎంత బలంగా ఉన్నారు, ఆరోగ్యపు అలవాట్లు , శారీరక శ్రమ ఇలా అన్ని విషయాల మీద ఆధారపడి ఉంటుంది.  
 

మరిన్ని వార్తలు