కరుడుగట్టిన ఉగ్రవాది కమ్రాన్‌ హతం

10 Apr, 2017 20:26 IST|Sakshi
కరుడుగట్టిన ఉగ్రవాది కమ్రాన్‌ హతం

కరాచీ: ఓ మోస్ట్‌వాంటెడ్‌ ఉగ్రవాది హతమయ్యాడు. కరాచీ ఎయిర్‌పోర్ట్‌వంటివాటిపై దాడులకు పాల్పడి మారణహోమం సృష్టించి దొరకకుండా తప్పించుకుంటున్న ఉగ్రవాది కమ్రాన్‌ జంషెడ్‌ భట్టిని పాక్‌కు చెందిన కౌంటర్‌ టెర్రరిజం డిపార్ట్‌మెంట్‌(సీటీడీ) అధికారులు మట్టుబెట్టారు. అతడు ఉగ్రవాద సంస్థ నయీం బుఖారీ ఆఫ్‌ లష్కరీ ఐ జాంగ్వి(ఎల్‌జే)కు చెందినవాడు. కమ్రాన్‌ కరడుగట్టిన ఉగ్రవాది. ఇతడు 2014 జూన్‌ 8 కరాచీ అంతర్జాతీయ విమానాశ్రయంపై బాంబులతో దాడికి తెగబడ్డాడు.

ఆ సమయంలో 26మంది అమాయకులు చనిపోగా 10 మంది ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. అలాగే, మెహ్రాన్‌ నేవీ బేస్‌పై దాడి చేసి 18మందిని చంపేశాడు. ఇలాంటివి అతడు చేసిన దుర్మార్గాలు ఇంకా చాలానే ఉన్నాయని పాక్‌ అధికారులు చెబుతున్నారు. ‘కమ్రాన్‌ ఓ కరడుగట్టిన తీవ్రమైన ఉగ్రవాది. ఎన్నో ఉగ్రదాడుల్లో అతడు మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌గా ఉన్నాడు. బలూచిస్థాన్‌ నుంచి తిరిగొచ్చిన అతడు ఇటీవలె సింధ్‌ ప్రావిన్స్‌లో తాజాగా పేలుళ్లకు పాల్పడేందుకు ప్రణాళికలు రచిస్తున్నాడు. ఈలోగా అప్రమత్తమైన పాక్‌ సీటీడీ అతడిని మట్టుబెట్టింది. ఇది మంచి ముందడుగు’ అని పాక్‌ సీటీడీ అధికారి సనావుల్లా అబ్బాసీ చెప్పారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు