టోర్నడోలో చిక్కుకున్నా బతికాడు..!

12 Dec, 2016 15:01 IST|Sakshi
టోర్నడోలో చిక్కుకున్నా బతికాడు..!

కొద్దిపాటి ఎత్తు నుంచి కిందికి దూకితేనే కాళ్లు విరిగినంత పనవుతుంది మనలో చాలామందికి. మరి, వెరుు్య అడుగుల పైనుంచి నేల మీద పడితే..? ఇలాంటి ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానం చెప్పొచ్చు. కానీ, అమెరికా కుర్రాడు ‘మ్యాట్ సూటర్’ విషయంలో మాత్రం అద్భుతం జరిగిందనే చెప్పాలి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 1,307 అడుగుల ఎత్తు నుంచి అమాంతం కిందపడ్డా ఈయన చిన్న చిన్న గాయాలతో బయట పడ్డాడు. నమ్మశక్యం కాకున్నా ఇది నిజం..!

2006లో అమెరికాలోని మిస్సోరీలో జరిగిన సంఘటన ఇది. తన అమ్మమ్మగారి ఇంటికి వచ్చిన 19 ఏళ్ల మ్యాట్ సూటర్.. సెలవులను ఎంజాయ్ చేస్తున్నాడు. బయట వాతావరణం కాస్తంత భయానకంగా ఉండటంతో ఆ రోజంతా కాస్తంత చికాకుగానే ఉన్నాడు. అరుుతే, వాతావరణం మరింత ముదిరింది. బలంగా గాలులు వీస్తున్నారుు. తమ ఇంటి లివింగ్ రూమ్ కిటికీ పరిస్థితి అరుుతే మరీ దారుణం..!

 అద్దాలు పగిలిపోతాయేమో అన్నంతగా కిటికీ అటూఇటూ కొట్టుకుంటోంది. దాన్ని సరిచేసేందుకు, గాలులను నిలువరించేందుకు సోఫాపైకి ఎక్కాడు సూటర్. అంతే.. చండప్రచండ వేగంతో గాలులు వీయడం ప్రారంభించారుు. కొద్ది సెకన్ల వ్యవధిలోనే భయంకరమైన సుడిగుండం అక్కడ ఏర్పడింది. దాదాపు గంటకు 165 మైళ్ల వేగంతో వచ్చిన ఈ భారీ సుడిగుండం.. సూటర్ ఉన్న ఇంటిని నెమ్మదిగా కదపడం మొదలుపెట్టింది. అంతే.. కుర్రాడి గుండెలు అదిరిపోయారుు.

 ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే ఇంటితో పాటు సూటర్ గాల్లోకి ఎగిరిపోసాగాడు. గాల్లో ఉండగానే ఇంటి పైకప్పు ఎగిరి, ఒక్కడే గాల్లో టోర్నడోలో చిక్కుకున్నాడు. అలా దాదాపు వెరుు్య అడుగుల పైనే ఎగిరిపోయాడు. ఈ సుడిగుండం సూటర్‌ను దాదాపు నాలుగు ఫుట్‌బాల్ మైదానాల అవతల తీసుకెళ్లి పడేసింది. అంతే.. ఇది చూసిన జనం పరుగెత్తుకుంటూ అక్కడికి వెళ్లి చూశారు. ఆశ్చర్యం..! సూటర్ బతికే ఉన్నాడు. అది కూడా చిన్నచిన్న గాయాలతోనే..! ఈ వింతను చాలాకాలం వాతావరణ శాఖ అధికారులు కూడా నమ్మలేకపోయారు. అంత ఎత్తు నుంచి పడ్డాక కూడా ప్రాణాలతో బయటపడటంతో సూటర్ రికార్డులకెక్కాడు!

మరిన్ని వార్తలు