ప్రేయసితో పెళ్లి.. వరుడి కంట కన్నీరు..

11 May, 2018 18:47 IST|Sakshi
టైరోన్‌ ఆర్మిటేజ్‌

మెల్‌బోర్న్‌ : ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి పెళ్లి కూతురై నడుచుకుంటూ వస్తుంటే.. ఆనందంతో ఉక్కిరి బిక్కిరవ్వాల్సిన ఆ పెళ్లి కుమారుడి కళ్లలో కన్నీళ్లు ఉబికాయి. అలా కన్నీళ్లతో ఆమెవైపు చూస్తూ ఉండిపోయాడు. ఆ కన్నీళ్ల వెనుక కారణం తెలుసుకున్న వారు జీవితం అంటే ఇంతేనేమో అనుకున్నారు. వివరాలలోకి వెళితే.. మెల్‌బోర్న్‌కు చెందిన టైరోన్‌ ఆర్మిటేజ్‌, కెల్లీ ఆర్మిటేజ్‌లు 11ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

కొన్ని రోజుల క్రితమే వీరిద్దరికి పెళ్లి నిశ్చయమైంది. టైరన్‌ ఎంతో కాలంగా వేచి చూసున్న ఆ మధుర క్షణం కొద్ది రోజుల్లో రానుందనే ఆనందంలో ఉన్నాడు. పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న అతనికి సోదరి నుంచి ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. అంతులేని ఆనందంలో ఉన్న అతడు ఒక్కసారిగా కుప్ప కూలాడు. తన తండ్రికి క్యాన్సర్‌ అని, ఎక్కువరోజులు ఆయన బతకడని తెలిసి కుంగిపోయాడు.

చివరి రోజుల్లో అయినా ఆయన్ను ఆనందంగా ఉంచాలని భావించిన అతను శరవేగంగా ప్రియురాలితో పెళ్లి ఏర్పాటు చేసుకున్నాడు. వివాహం రోజున కెల్లీ పెళ్లి కూతురు దుస్తుల్లో ఎదురుపడటంతో ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యాడు. ‘నా ప్రాణం ఉన్నంత వరకు నీతో జీవించాలనుకున్నాను. అది నెరవేరుతోంది. నేనిది నమ్మలేకపోతున్నా’ అని టైరోన్‌ కెల్లీకి చెప్పాడు. పెళ్లి వేడుకలో తండ్రి కొడుకులు ఆత్మీయంగా కౌగిలించుకుని ఏడవటం పలువురి హృదయాలను కదిలించింది.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా