ఆ బీచ్‌లో సెల్ఫీ తీసుకుంటే మరణ శిక్ష!

10 Apr, 2019 21:20 IST|Sakshi

పుకెట్‌: పర్యాటకులకు హెచ్చరిక! బీచ్‌లో సెల్ఫీలు తీసుకుంటే మరణ శిక్ష విధిస్తారట. అదేంటీ? సెల్ఫీలు తీసుకుంటే తప్పేంటీ  అనుకుంటున్నారా? అయితే, మీరు థాయ్‌లాండ్‌లోని పుకెట్‌ ఐలాండ్‌ గురించి తెలుసుకోవాలి. ఇక్కడ ఉన్న మాయ్‌ ఖావో బీచ్‌కు ఆనుకోని ఫూకెట్‌ అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌ వే ఉంది. ఇక్కడ విమానాలు ఈ బీచ్‌కు అత్యంత సమీపం నుంచి టేకాఫ్‌ అవుతాయి. దీంతో పర్యాటకులు తమ తలపై నుంచి వెళ్లే విమానాలతో సెల్ఫీలు దిగుతున్నారు. అయితే ఇది పర్యాటకులకు ప్రమాదకరమే కాకుండా, విమానాలకు కూడా ముప్పు కలిగించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్యాటకులు ఆ ప్రాంతానికి రాకుండా కఠిన శిక్షలు, జరిమానాలు విధించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు బీచ్‌ను సేఫ్టీ జోన్‌లోకి చేరుస్తామని ప్రకటించారు. ఈ నిబంధనలను అతిక్రమించే వారికి మరణ దండన లేదా జీవిత ఖైదు లేదా రూ.70 వేలు పైగా జరిమానాలు విధించేందుకు సిద్ధమవుతున్నారు. 

మరిన్ని వార్తలు