'25 ఏళ్లుగా ఆగని మృత్యుఘోష'

24 Sep, 2015 19:01 IST|Sakshi
'25 ఏళ్లుగా ఆగని మృత్యుఘోష'

గత పాతికేళ్లుగా  ఇదే వరుస. హజ్ యాత్ర ప్రారంభం అవుతున్న ప్రతిసారి ప్రభుత్వ పెద్దల్లో ఆందోళన. ఏ క్షణం ఏం జరుగుతుందో ఎలా ప్రమాదం చోటు చేసుకుంటుందో ఊహించకుండానే జరగాల్సింది జరిగిపోతుంది. మృత్యుఘోష వినిపిస్తోంది. ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే హజ్ యాత్రలో గత 25 సంవత్సరాలలోనే ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. యాత్రా నిర్వాహకులు ఎంతో అప్రమత్తంగా ఉన్న ఏదో ఒక రూపంలో యాత్రికులను మృత్యువు కభళిస్తోంది. హజ్ యాత్ర కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు దేశాల నుంచి లక్షల్లో ముస్లింలు వస్తుంటారు.

తన జీవిత కాలంలో ఒక్కసారైనా హజ్ యాత్రను సందర్శించాలని ముస్లింలు కోరుకుంటారు. ఎంతో పవిత్రంగా ఆ కార్యక్రమం పూర్తి చేసేందుకు  వారు పెద్ద ఎత్తున తరలి వెళుతుంటారు. అలా వెళ్లిన వారికి నిర్వహణా అధికారులకు మధ్య ఘర్షణ చోటుచేసుకోవడమో లేక ఏదో ఒక కారణంతో తొక్కిసలాట చోటుచేసుకోవడమో జరుగుతుండటం సర్వసాధరణంగా తయారైంది. ఫలితంగా అదే ప్రాణ నష్టం. వీటికి భిన్నంగా ఇదే నెల 12న మక్కాలోని ఓ భారీ క్రేన్ యాత్రికులపై కూలిపోయి దాదాపు 107 మంది చనిపోవడం, పదిహేను రోజులు తిరగకుండానే తొక్కిసలాట చోటుచేసుకుని 453మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం అక్కడి అధికారులనే కాక, యాత్రికులను కూడా తీవ్రంగా కలవర పెడుతోంది.   


ఇప్పటి వరకు గత 25 ఏళ్లలో హజ్ యాత్రలో చోటుచేసుకున్న విషాదాలను పరిశీలిస్తే..  

  • 1987 లో ఇరానియన్ యాత్రికులకు సౌదీ అధికారులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుని 402 మంది చనిపోగా.. 650మందికి పైగా గాయాలపాలయ్యారు.
  • 1989లో రెండు బాంబులు పేలుళ్లు చోటుచేసుకొని ఓ యాత్రికుడు చనిపోగా 16మంది గాయాలపాలయ్యారు.
  • 1990లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ టన్నెల్ను పాదయాత్రగా వెళుతున్న యాత్రికుల మధ్య తొక్కిసలాట చోటుచేసుకుని దాదాపు 1426మంది మృత్యువాత పడ్డారు.
  • 1997 లో ఓ అగ్ని ప్రమాదం చోటు చేసుకుని 340మంది చనిపోగా.. 1500మంది గాయాలపాలయ్యారు.
  • 1998లో ఓ ఇరుకైన మార్గం ద్వారా ఎక్కువమంది యాత్రికులను వెళ్లేందుకు అనుమతించడం వల్ల తొక్కిసలాట చోటు చేసుకుని 180మంది యాత్రికులు చనిపోగా పలువురు గాయాలపాలయ్యారు.
  • 2001లో ఓ తొక్కిసలాట చోటుచేసుకుని 35మంది చనిపోయారు.
  • 2004లో సైతాన్ స్టోన్పై రాళ్లు విసిరే సమయంలో తొక్కిసలాట చోటుచేసుకుని దాదాపు 250మంది ప్రాణాలు విడిచారు.
  • 2006లో కూడా సైతాన్ స్టోన్పై రాళ్లు విసిరే క్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుని 350మంది చనిపోయారు.
  • 2015 సెప్టెంబర్ 12న మక్కామసీదులో ఓ భారీ క్రేన్ కూలిపోయి దాదాపు 110మంది ప్రాణాలు విడిచారు.
  • 2015 సెప్టెంబర్ 24న తొక్కిసలాట చోటుచేసుకుని 453 మంది చనిపోగా 750 మందికి పైగా గాయాలపాలయ్యారు. 

>
మరిన్ని వార్తలు