‘ఆల్ప్స్’ అడుగున రైలు మార్గం

30 May, 2016 02:03 IST|Sakshi
‘ఆల్ప్స్’ అడుగున రైలు మార్గం

జెనీవా: ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ రైలు మార్గానికి సర్వం సిద్ధమైంది. స్విట్జర్లాండ్‌లోని ప్రఖ్యాత ఆల్ప్స్ పర్వతాల కింద నిర్మిస్తున్న ‘గోథార్డ్ బేస్ టన్నెల్’ సొరంగ మార్గం దాదాపు పూర్తయింది. ఈ రైలు మార్గం పొడవు 57.4 కిలోమీటర్లు. యురీ దగ్గర్లోని ఎస్ట్‌ఫీల్డ్ నుంచి టిసినో సమీపంలోని బోడియో ప్రాంతానికి రైలు మార్గాన్ని నిర్మించారు. రెండు లేన్ల ఈ మార్గానికి రూ.82,000 కోట్లు ఖర్చయింది. సొరంగ తవ్వకాల్లో భాగంగా 2.8కోట్ల టన్నుల శిలలను తొలగించారు.

కొత్త మార్గంలో జ్యూరిక్-మిలాన్ మధ్య రాకపోకలకు గంట సమయం తగ్గనుంది. పెద్దమొత్తంలో సరకు రవాణాకు ఈ మార్గం దోహదపడనుంది. 1947లోనే ఈ మార్గాన్ని నిర్మించాలని స్విస్ ఇంజనీర్ కార్ల్ ఎడ్వర్డ్ గ్రూనర్ ప్రణాళికలు రచించినప్పటికీ 1999 సంవత్సరంలోగానీ ప్రాజెక్టుకు అంకురార్పణ జరగలేదు. జూన్ 1న ప్రారంభవేడుక జరగనుంది. సర్వీసులు డిసెంబర్‌లో మొదలుకానున్నాయి.

మరిన్ని వార్తలు