'నెట్'ను ముంచే డీల్ కుదిరింది!

6 Oct, 2015 19:48 IST|Sakshi
'నెట్'ను ముంచే డీల్ కుదిరింది!

అంతర్జాతీయంగా ఇంటర్నెట్ స్వేచ్ఛకు తీవ్ర ముప్పుగా భావిస్తున్న ద ట్రాన్స్-పసిఫిక్ పార్టనర్షిప్ (టీపీపీ) ఒప్పందం కుదిరింది. ఐదేండ్ల సుదీర్ఘ చర్చలు, సంప్రదింపులు అనంతరం ఈ ఒప్పందంపై మంగళవారం సంతకాలు పూర్తయాయి. 40శాతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కవర్ చేయనున్న ఈ ఒప్పందం ఉద్దేశం ఏకీకృత ఆర్థిక బ్లాకును ఏర్పాటుచేయడం. దీనిద్వారా కంపెనీలు, వ్యాపారసంస్థలు తమ వ్యాపారాన్ని సులువుగా నిర్వహించుకోవచ్చు. అయితే ఈ ఒప్పందం ఇంటర్నెట్ ప్రధాన సూత్రాలను నీరుగార్చే అవకాశముందని ఈ డీల్కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉద్యమకారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

కార్పొరేట్ అక్రమాలను 'కంప్యూటర్ సిస్టం' ద్వారా వెలుగులోకి తేవడం నేరమవుతుందని ఈ ఒప్పందంలో ఉన్న ఓ వివాదాస్పద నిబంధనపై ప్రధానంగా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ నిబంధనలోని పదజాలం అస్పష్టంగా ఉందని, దీనివల్ల విజిల్ బ్లోయర్లు ఏదైనా సమాచారం ఆన్లైన్ ద్వారా వెల్లడిచేస్తే.. అందుకు జరిమానా గురయ్యే అవకాశం ఉందని, అంతేకాకుండా పాత్రికేయులు కూడా ఈ సమాచారాన్ని ప్రచురించడానికి ముందుకురాకపోవచ్చునని నిపుణులు అంటున్నారు. ఈ ఒప్పందం ప్రకారం అమెరికాలో మాదిరి ఒక చిన్న ఫిర్యాదు వచ్చినా ఆ సమాచారాన్ని యూట్యూబ్, ఫేస్బుక్ వంటి ఆన్లైన్ కంటెంట్ ప్రొవైడర్స్ తొలగించాల్సి ఉంటుంది.

 

మరిన్ని వార్తలు