స్నేహమంటే ఇదేరా! 

25 Feb, 2018 00:51 IST|Sakshi

చిన్ననాటి స్నేహితులను కలసి మన జ్ఞాపకాలను పంచుకుంటే ఆ మధురమే వేరు. ఆ పాత స్మృతులను తలుచుకుంటూ ఒక్కసారిగా బాల్యంలోకి తొంగిచూస్తుంటే ఒళ్లు పులకరిస్తుంటుంది. సంతోషంలో ఉన్నప్పుడే కాదు.. కష్టాల్లోనూ నేనున్నా అంటూ భుజం తడుతుంది ఆ స్నేహం. తన చిన్ననాటి ఓ స్నేహితుడు కష్టాల్లో ఉన్నాడని తెలిసి చేరదీసి.. అతడిని మామూలు మనిషిని చేసి.. ఆహా అనిపించుకుంది. ఈ కథ మీకోసం.. కెన్యా దేశానికి చెందిన ప్యాట్రిక్‌ హింగా మాదక ద్రవ్యాలకు అలవాటు పడి.. దాదాపు జీవితం మొత్తాన్ని కోల్పోయాడు.. ఇదే సమయంలో అదృష్ట దేవత తలుపు తట్టింది.

తనతో చిన్నప్పుడు చదువుకున్న వంజా వారా అనే అమ్మాయికి ప్యాట్రిక్‌ ఎదురయ్యాడు. అతడిని గుర్తుపట్టిన వారా ప్యాట్రిక్‌ జీవితాన్ని సమూలంగా మార్చేసింది. ఎన్నో ఆస్పత్రులు తిప్పి కావాల్సిన చికిత్సలు చేయించి కంటికి రెప్పలాగా చూసుకుంది. చివరికి ప్యాట్రిక్‌ మామూలు మనిషి అవ్వడమే కాదు.. అన్ని దురలవాట్లకు దూరమై.. ఇప్పుడు బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటూ తన కాళ్లపై తాను నిలబడ్డాడు. ఇలాంటి ఓ మంచి ఫ్రెండ్‌ ఒక్కరుంటే చాలు జన్మ ధన్యం అయినట్లే కదూ!  

మరిన్ని వార్తలు