హెచ్‌–4 వీసాల్ని కొనసాగించండి

17 Mar, 2018 03:04 IST|Sakshi

వాషింగ్టన్‌: హెచ్‌1–బీ వీసాదారుల జీవిత భాగస్వాములు అమెరికాలో చట్టబద్ధంగా పనిచేసేందుకు వీలుకల్పించే హెచ్‌–4 వీసా నిబంధనను కొనసాగించాలని సిలికాన్‌ వ్యాలీకి చెందిన పలువురు డెమొక్రాట్‌ చట్టసభ్యులు డిమాండ్‌ చేశారు. 2015లో ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమల్లోకి తెచ్చిన ఈ నిబంధనతో భారతీయ–అమెరికన్లు ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు. హెచ్‌–4 వీసా నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత 1,04,000 మందికి అమెరికాలో పనిచేసేందుకు అనుమతి లభించింది. ట్రంప్‌ సర్కారు హెచ్‌–4 వీసాల్ని రద్దు చేసే ప్రయత్నాల్లో ఉందన్న వార్తల నేపథ్యంలో డెమొక్రాట్‌ ఎంపీలు స్పందిస్తూ.. మార్చి 5న అమెరికా హోం ల్యాండ్‌ విభాగానికి లేఖ రాశారు.

మరిన్ని వార్తలు