న్యూయార్క్‌లో ట్రంప్, హిల్లరీ గెలుపు

21 Apr, 2016 01:35 IST|Sakshi
న్యూయార్క్‌లో ట్రంప్, హిల్లరీ గెలుపు

న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికన్ పార్టీలో ట్రంప్, డెమోక్ర టిక్ పార్టీలో హిల్లరీ క్లింటన్ దూసుకుపోతున్నారు. మంగళవారం జరిగిన న్యూయార్క్ ప్రైమరీ ఎన్నికల్లో ఇద్దరూ విజయం సాధించి.. ఆయా పార్టీల నామినేషన్‌కు చేరువగా నిలిచారు. స్వస్థలమైన న్యూయార్క్‌లో గెలుపుతో సుమారు 95 మంది డెలిగేట్లను గెల్చుకున్న ట్రంప్.. ఇప్పటికి 847 మంది డెలిగేట్ల మద్దతు సాధించారు. నామినేషన్‌కు అవసరమైన 1,237 మంది డెలిగేట్లను పొందే దిశగా సాగిపోతున్నారు. జూలైలో జరిగే పార్టీ సమావేశంలో పోటీ చేసే అవసరం లేకుండానే రిపబ్లికన్ పార్టీ నామినేషన్ పొందే స్థితి సాధించారు.  హిల్లరీ క్లింటన్ డెలిగేట్ల సంఖ్య 1,990కి చేరింది.

>
మరిన్ని వార్తలు