ఇలాగైతే ఎక్కువ కాలం ఉండరు!

25 Sep, 2017 02:23 IST|Sakshi

ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి వ్యాఖ్యలపై విరుచుకుపడ్డ ట్రంప్‌

న్యూయార్క్‌: ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్వీటర్‌లో విరుచుకుపడ్డారు.

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌లాగే ఆ దేశ విదేశాంగ మంత్రి రి యాంగ్‌ హో ప్రమాదకరంగా మాట్లాడుతున్నారని, ఉ.కొరియా తన ధోరణిని మార్చుకోకుంటే ఎక్కువ కాలం మనుగడ సాగించదని ట్వీటర్‌లో పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు