'ఆఫ్రికన్ అమెరికన్ల ఓటు ట్రంప్కే'

28 Aug, 2016 10:30 IST|Sakshi
'ఆఫ్రికన్ అమెరికన్ల ఓటు ట్రంప్కే'
వాషింగ్టన్: అమెరికా నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్(ఎన్బీఏ) స్టార్ ఆటగాడు డ్వైన్ వేడ్ సోదరి నికియా ఆల్డ్రిడ్జ్ శుక్రవారం దుండగుల కాల్పుల్లో మృతి చెందారు. దక్షిణ చికాగోలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఓ వ్యక్తిపై కాల్పులు జరుపుతుండగా.. తన పాపతో అటుగా వెళ్తున్న నికియా ఆల్డ్రిడ్జ్కు బుల్లెట్లు తగలడంతో ఆమె మృతి చెందారు. ఈ ఘటనతో అమెరికాలోని గన్కల్చర్పై మరోసారి తీవ్రస్థాయిలో దుమారం రేగుతోంది. బాస్కెట్ బాల్ స్టార్ ప్లేయర్ డ్వైన్ వేడ్ ఈ ఘటనపై ట్విట్టర్లో పేర్కొంటూ.. సెన్స్లెస్ గన్కల్చర్ మూలంగా తన సోదరిని కోల్పోయానని ఆవేదన వ్యక్తంచేశాడు. ఈ చర్యతో నలుగురు పిల్లలు తన తల్లిని కోల్పోయారని విషాదం వ్యక్తం చేశాడు.
 
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరఫున బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇది జాతి వివక్షకు సంబంధించిన చర్యగా పేర్కొన్నారు. ఈ ఘటనపై ట్విట్టర్లో 'డ్వైన్ కజిన్ను చికాగోలో కాల్చిచంపారు. నేను చెప్పదల్చుకున్నది ఏంటంటే.. ఆఫ్రికన్ అమెరికన్లు ట్రంప్కు ఓటేయనున్నారు' అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. నికియా ఆల్డ్రిడ్జ్ కుటుంబానికి శాంతిచేకూరాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ట్రంప్ చర్యపై డెమోక్రటిక్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆల్డ్రిడ్జ్ మరణాన్ని ట్రంప్ ఆఫ్రికన్ అమెరికన్ల ఓట్లతో ముడిపెట్టడం దారుణమైన చర్య అని విమర్శించారు.
మరిన్ని వార్తలు