దేశీయ ఉగ్రవాద చర్యలు: రంగంలోకి సైన్యం

2 Jun, 2020 08:31 IST|Sakshi

నిరసనలపై మండిపడ్డ ట్రంప్‌

హింసను అదుపుచేయలేకపోతే సైన‍్యాన్ని పంపుతా రాష్ట్రాలకు ట్రంప్ హెచ్చరిక

వాషింగ్టన్‌: ఆఫ్రికన్‌ అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మరణంతో రగిలిన అశాంతి, దావానలంలా రగులుతోంది. అగ్రరాజ్యంలోని పలు రాష్ట్రాల్లో నిరసనలు, ఆందోళనలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌‌వద్ద భారీ స్థాయిలో నిరసన చెలరేగడంతో భారీ ఎత్తున సైన్యాన్ని రంగంలోకి దించుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. రాజధాని నగరంలో హింసాత్మక నిరసనలను అరికట్టడానికి అదనపు బలగాలను పంపుతున్నామన్నారు. (అమెరికాలో ఆగ్రహపర్వం)

జార్జ్ ఫ్లాయిడ్ మృతితో దేశవ్యాప్తంగా నిరసన పేరుతో నగరంలో చాలా అమర్యాదకరమైన ఘటనలు చోటు చేసుకున్నాయని, అవి శాంతియుత నిరసనలు కావంటూ మండిపడ్డారు. ఈ అల్లర్లను దేశీయ ఉగ్రవాద చర్యలుగా ఆయన పేర్కొన్నారు. వాషింగ్టన్‌లో అల్లర్లు, దోపిడీలు, దాడులు, ఆస్తి విధ్వంసాలను ఆపడానికి వేలాది మంది సాయుధ సైనికులు, ఇతర పొలీసు అధికారులను పంపిస్తున్నానని ప్రకటించారు. (భగ్గుమన్న అగ్రరాజ్యం: వైట్‌హౌస్‌ వద్ద ఉద్రిక్తత)

అంతేకాదు  శాంతిభద్రతల అధ్యక్షుడిగా తనని తాను ప్రకటించుకున్న అమెరికా అధ్యక్షుడు ఆస్తులను రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, హింసను నియంత్రించడానికి వీలైనంత ఎక్కువ నేషనల్ గార్డ్ దళాలను ఉపయోగించాలని గవర్నర్లను ట్రంప్ కోరారు. అలాగే అలర్లకు పరోక్షంగా ఆయా రాష్ట్రాల గవర్నర్లే కారణమని ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలామంది గవర్నర్లు శక్తిహీనులుగా మారారని మండిపడ్డారు.  అల్లర్లు జరిగిన చారిత్రాత్మక సెయింట్ జాన్ చర్చిని, రెండో ప్రపంచ యుద్ధం స్మారక కట్టడాన్ని ట్రంప్‌ సందర్శించారు.

మరిన్ని వార్తలు