జీ7లో భారత్‌ను చేర్చాలి : ట్రంప్‌

31 May, 2020 10:09 IST|Sakshi

ఫ్లోరిడా : ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల సమూహాం (జీ7 సమ్మిట్‌) కు భారత్‌, మరికొన్ని దేశాలను చేర్చాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  కోరారు. జూన్‌12న వైట్‌ హౌస్‌లో నిర్వహించనున్న జీ7 శిఖరాగ్ర సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. అంతేగాక జీ7ను కాలం చెల్లిన గ్రూప్‌గా ట్రంప్‌ అభివర్ణించారు. ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌లో ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్‌ డిసికి వెళుతున్న సమయంలో తనతో పాటు ఉన్న విలేకరులతో ట్రంప్‌ మాట్లాడుతూ.. ' సెప్టెంబర్‌ వరకు జీ7ను వాయిదా వేస్తున్నాం. జీ7 వల్ల ప్రపంచంలో ఏమి ఉపయోగం ఉందని నేను భావించడం లేదు. ఇది కాలం చెల్లిన సమూహం. రష్యా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, భారతదేశాలను ఆహ్వానించాలని యోచిస్తున్నాం. జీ7ను విస్తరించే వరకు సమావేశాలు వాయిదా వేయాలని నిర్ణయించాం' అంటూ తెలిపారు. (స్పేస్‌ ఎక్స్‌.. నింగిలోకి వ్యోమగాములు)

చైనాను భవిష్యత్తులో ఎలా ఎదుర్కోవాలో మాట్లాడటానికి ఈ గ్రూప్‌ ఏ విధంగా ఉపయోగపడుతుందనేది దేశ సాంప్రదాయ మిత్రులతో కలిసి  నిర్ణయం తీసుకుంటామని వైట్‌ హౌస్‌ స్ట్రాటజిక్‌ కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ అలిస్సా అలెగ్జాండ్రా ఫరా అన్నారు. అప్పటికి కరోనా వైరస్‌ వ్యాప్తి గతి మారితే తప్ప శిఖరాగ్ర సమావేశానికి హాజరుకాదని జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ కార్యాలయం శనివారం తెలిపింది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌, అమెరికా‌, యూకే‌, కెనడాలు జి. ఈ దేశాల అధిపతులు అంతర్జాతీయ ఆర్థిక, ద్రవ్య సమస్యలపై ఏటా సమావేశమవుతారు. శిఖరాగ్ర సమావేశంలోజీ7 అధ్యక్షుడు సాధారణంగా ఒకటి లేదా రెండు దేశాల దేశాధినేతలను ప్రత్యేక ఆహ్వానికంగా సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానిస్తారు ఈ ఏడాది జీ7 అధ్యక్ష భాద్యతను అమెరికా జూన్‌ 12న నిర్వహించాల్సి ఉంది. గత ఏడాది ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మాక్రాన్‌ జీ7 శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు.
(డబ్ల్యూహెచ్‌ఓతో అమెరికా కటీఫ్‌)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా