భారత్‌, చైనాలకు ట్రంప్‌ వార్నింగ్‌!

14 Aug, 2019 19:17 IST|Sakshi

వాషింగ్టన్‌ : అభివృద్ధి చెందుతున్న దేశాలుగా చెప్పుకొంటూ భారత్‌, చైనా నేటికీ ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) కల్పించే ప్రయోజనాలను పొందుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విమర్శించారు. ఇకపై తాను ఇలా జరగబోనివ్వనని హెచ్చరించారు. భారత దిగుమతులపై టారిఫ్‌లు పెంచేయడంతో.. భారత్‌ కూడా అంతే దీటుగా స్పందించిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్థను (డబ్ల్యూటీవో) ఆశ్రయించింది. గతేడాది భారత్, ఇతర దేశాల నుంచి వచ్చే అల్యూమినియం, స్టీల్‌ ఉత్పత్తులపై సుంకాలను అమెరికా పెంచేయడమే కాకుండా, జీఎస్‌పీ కింద భారత్‌కు చెందిన కొన్ని ఉత్పత్తులకు ఇస్తున్న జీరో టారిఫ్‌ ప్రయోజనాన్ని కూడా ఈ ఏడాది మే నుంచి నిలిపేసింది. దీంతో భారత్‌ అమెరికా నుంచి దిగుమతి అవుతున్న బాదం, వాల్‌నట్స్‌ తదితర 28 రకాల ఉత్పత్తులపై గత నెల నుంచి టారిఫ్‌లను పెంచింది. అదే విధంగా చైనాతో కూడా ట్రంప్‌ వాణిజ్య యుద్ధానికి దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరు దేశాలు పరస్పరం సుంకాలు పెంచాయి.

ఈ నేపథ్యంలో పెన్సుల్వేనియాలో మంగళవారం ట్రంప్‌ మాట్లాడుతూ...ఆసియాలో రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థలైన చైనా, భారత్‌లను ఇకపై అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పరిగణించకూడదని వ్యాఖ్యానించారు. ఈ సాకు చూపి చాలా ఏళ్లుగా ఈ రెండు దేశాలు వాణిజ్య సంస్థ నుంచి అనేక ప్రయోజనాలు పొందుతున్నాయని పేర్కొన్నారు. ఇందుకు డబ్ల్యూటీవోలోని లొసుగులు అడ్డుపెట్టుకుంటాయని, ఇకపై అలా చేస్తే యూఎస్‌ ట్రేడ్‌ రిప్రంజంటేటివ్‌ వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆసియా దేశాలతో పాటు టర్కీ కూడా డబ్ల్యూటీవో నిబంధనలను నీరుగార్చి ప్రయోజనాలు పొందుతోందని ఆరోపించారు. ‘ అన్నీ అభివృద్ధి చెందుతున్న దేశాలే. మేము మాత్రం అందుకు మినహాయింపే కదా. ఆ పేరు చెప్పుకొని వారంతా లాభం పొందుతున్నవారే. ఈ విషయంలో డబ్ల్యూటీవో మా వాదనను తప్పుబట్టదనే అనుకుంటున్నా’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఐటీ రంగంలో 30 లక్షల ఉద్యోగాలు

తప్పుగా చిత్రీకరించారు: జొమాటో సీఈఓ

రూ.11వేలతో రెనాల్ట్ ట్రైబర్ బుకింగ్స్‌

వాట్సాప్‌లో కొత్త సెక్యూరిటీ ఫీచర్‌

జియో యాప్స్‌తో వన్‌ప్లస్‌ తొలి టీవీ

యాపిల్ ఛార్జింగ్‌ కేబుల్‌తో డాటా చోరీ..!

ఐఫోన్‌ 11 ఆవిష్కరణ.. త్వరలోనే 

సన్‌ ఫార్మా లాభం రూ.1,387 కోట్లు

భారీ లాభాలు, 11వేల  ఎగువకు నిఫ్టీ

పీజీఐఎం నుంచి ఓవర్‌నైట్‌ ఫండ్‌

సెకనుకు 1,000 కప్పుల కాఫీ..!

మార్కెట్లోకి ‘పల్సర్‌ 125 నియాన్‌’ బైక్‌

ఓఎన్‌జీసీ లాభం రూ.5,904 కోట్లు

కారు.. కుదేలు..!

అదుపులోనే రిటైల్‌ ధరల స్పీడ్‌

కార్స్‌24లో ధోనీ పెట్టుబడి

సుంకాలు వాయిదా, లాభపడుతున్న రూపాయి 

లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు 

రిలయన్స్‌ గర్జన.. మార్కెట్‌ బేర్‌!

రూపాయి 38 పైసల నష్టం

నష్టాల ప్రారంభం, రిలయన్స్‌ జూమ్‌ 

తులం బంగారం రూ.74 వేలు

ముకేశ్‌.. మెగా డీల్స్‌!

రిలయన్స్ ఇండస్ట్ర్రీస్..మరో సంచలనం

కశ్మీర్‌లో పెట్టుబడులకు సిద్ధం: ముకేశ్‌ అంబానీ

అనిల్ అంబానీకి మరో ఎదురు దెబ్బ

రిలయన్స్‌తో సౌదీ ఆరామ్కో భారీ డీల్‌

జియో ఫైబర్‌ సంచలనం: బంపర్‌ ఆఫర్లు

స్టార్టప్‌లకు ఆర్‌ఐఎల్‌ బొనాంజా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చుక్కలనంటుతున్న ‘సాహో’ లెక్కలు

అమర జవాన్లకు బాలీవుడ్‌ నివాళి

‘అవును..మేము ప్రేమలో ఉన్నాం’

సైరా మేకింగ్‌ వీడియో చూశారా..

‘జాము రాతిరి’కి ముప్పై ఏళ్లు

400 మందికి గోల్డ్‌ రింగ్స్‌ ఇచ్చిన హీరో!