వారి భ‌ద్ర‌త ఖ‌ర్చులు ప్ర‌భుత్వం చెల్లించ‌దు: ట్రంప్‌

30 Mar, 2020 10:09 IST|Sakshi

భ‌ద్ర‌త ఖ‌ర్చులు ప్రిన్స్‌హ్యీరీ చెల్లించాల్సిందే:  ట్రంప్‌

వాషింగ్టన్‌ : ప్రస్తుతం కెన‌డాలో నివశిస్తున్న ప్రిన్స్‌హ్యారీ, మేఘ‌న్ మార్కెల్‌ దంప‌తులు అమెరికాకు వస్తే వారి భ‌ద్ర‌తా ఖ‌ర్చులను తమ ప్ర‌భుత్వం చెల్లించే ప్రసక్తేలేదని ఆ దేశ‌ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేర‌కు ఆయ‌న ఆదివారం ట్వీట్ చేశారు. ‘నేను.. యునైటెడ్ కింగ్‌డమ్‌, ఆదేశ రాణికి మంచి స్నేహితుడిని. వారిపై నాకు ఎంతో అభిమానం ఉంది. రాజ కుటుంబం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన హ్యారీ, మేఘన్.. కెనడాలో శాశ్వతంగా నివసిస్తారని తెలిసింది. ఇప్పుడు వారు కెనడా నుంచి యుఎస్‌కు వ‌స్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ హ్యారీ దంపతులు యూఎస్‌ వస్తే వారి భద్రతా ఖర్చులు మా ప్రభుత్వం చెల్లించదు. వారే స్వయంగా చెల్లించాలి’ అని ట్రంప్‌ పేర్కొన్నాడు. (కరోనా కరాళ నృత్యం)

కాగా గ‌తేడాది క్వీన్ ఎలిజ‌బెత్ మ‌న‌వ‌డు ప్రిన్స్ హ్య‌రీ, మేఘ‌న్‌ దంప‌తులు జ‌న‌వ‌రిలో రాచ‌రిక హోదాను, బ్రిటీష్ రాజ కుటుంబం నుంచి వేరుప‌డ్డ విష‌యం తెలిసిందే. స్వతంత్రంగా జీవించాల‌ని నిర్ణ‌యించుకున్న వీరు కెన‌డాలోని వాంకోవ‌ర్ ద్వీపం వ‌ద్ద విలాస‌వంత‌మైన భ‌వంతిలో త‌మ జీవితాన్ని గ‌డుపుతున్నారు. అయితే రాజ కుటుంబం నుంచి వైదొలిగిన నాటి నుంచి వారి భ‌ద్ర‌తకు అయ్యే ఖ‌ర్చుల‌ను చెల్లించ‌డం మానేస్తామ‌ని గ‌త నెల‌లో కెన‌డియ‌న్ అధికారులు వెల్ల‌డించారు. ఈ దంపతులు ప్ర‌స్తుతం కాలిఫోర్నియాకు మ‌కాం మార్చాతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌ స్పందించారు. (ప్రిన్స్ హ్యారీ దంపతుల భద్రతా ఖర్చుకునో)

మరిన్ని వార్తలు